Ginger benefits : అసలు శొంఠి అంటే ఏంటి, చాలామందికి శొంఠి అంటే కూడా తెలీయదు. మనం రోజూ ఇంట్లో వాడే అల్లం గురించి తెలుసు కదండీ ఆ అల్లం ని ఎండబెడితే తయారయ్యే పదార్థమే శొంఠి. ఇక పోతే శొంఠి వాడటం వలన కలిగే ఉపయోగాలు, ఎందుకు వాడాలో తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరికీ ఉన్న సమస్య అజీర్తి. అజీర్తి అంటే తిన్నది అరగకపోవడం చిన్నవాళ్ళకి పెద్దవాళ్లకి కొంచెం అన్నం తినగానే కడుపు నిండినట్టు అనిపించడం లేదా ఆకలి కాకపోవడం సరిగ్గా తిని, తినక దాంతో నీరసం వస్తుంది.
దాంతో అందరూ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి సిరప్ అని, ట్యాబ్లెట్స్ అని ఆకలికోసం మెడిసన్ తెచ్చుకొని వాడుతారు. అలా మెడిసిన్ తెచ్చుకుని వాడటం వంటివి తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తాయి. ఇలా ఆకలి సమస్యలు ఉన్నవారు అందరూ శొంఠికొమ్ములు తెచ్చుకుని మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చెయ్యగా ఒక పొడి లాగా తయారవుతుంది. ఆ పొడిని మళ్లీ ఒకసారి జల్లి పట్టి మెత్తగా పొడిలా చేసుకోవాలి .ఆ మెత్తని పొడిని సీసాలలో నిల్వ కూడా చేసుకోవచ్చును. ఇలా నిల్వ చేసుకున్న శొంఠిని అన్నంలో తినవచ్చును. కానీ శొంఠిని అలా తినడం వల్ల మంటగా అనిపిస్తుంది కాబట్టి శొంఠి తో పాటు తేనె కలుపుకుని అన్నం తో తినవచ్చును.
Ginger benefits : శొంఠి వాడితే కలిగే ఉపయోగాలు

ఇలా శొంఠి పొడి కలిపిన అన్నం ని ఒక రెండు, మూడు ముద్దలు, కొద్ది రోజుల వరకు, అజీర్ణ సమస్య తీరేంతవరకు తీసుకోవచ్చును.అలాగే శొంఠిని మజ్జికలో కూడా కలుపుకుని తాగవచ్చును. ఏ విధంగా వీలైతే ఆ విధంగా శొంఠిని కొద్దిరోజులపాటు వాడాలి. మన ఆకలి సమస్య తీరేంతవరకు శొంఠిని తీసుకోవాలి. ఇంకా శొంఠిని కొంచెం గోరువెచ్చని నీటిలో కూడా కలుపుకొని తాగడం వలన కడుపులో ఉన్న జీర్ణ సమస్య పోతుంది.ఇలా గోరువెచ్చని నీటిలో శొంఠి నీ కలుపుకొని తాగడం వలన జీర్ణ సమస్యలతో పాటు మన రక్తంలో ఉండే చెడు వ్యర్థ పదార్థాలను కూడా బయటికి తొలగిస్తుంది.
అస్తమా వ్యాధిగ్రస్థులు కూడా ఈ గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగవచ్చును. అలాగే వేడినీటిలో కలుపుకుని తాగడం వలన ఒంటి నొప్పులు కూడా పోతాయి.అందరి ఇళ్లల్లో అమ్మమ్మ, నానమ్మ వాళ్లు ఇంటి సభ్యులకి ఎవరికైనా జలుబు చేయగానే మొదటిగా చేసే రేమిడి శొంఠిని వాడటం. జలుబు చేసినా వారు శొంఠిని తీసుకోవడం వలన తక్షణమే ఉపశమనం దొరుకుతుంది. చిన్నపిల్లలు కూడా దీనిని వాడొచ్చు, చూశారు కదండి శొంఠిని వాడటం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, ఇలాంటి సమస్యలు ఉన్నవారు తప్పకుండా శొంఠిని వాడి చూడండి.