Anshumalika : రోజా కూతురి సెల్ఫీ వీడియో..ఆడేసుకుంటున్న నేటిజనులు

Anshumalika  : ఒకప్పుడు తన అంద చందాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన రోజా స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. అప్పటి స్టార్ హీరోల అందరి సరసన రోజా నటించింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా తన నటనతో క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే కొన్నాళ్లపాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన రోజ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మెప్పించారు. అనంతరం రాజకీయ ప్రవేశం చేసి ప్రస్తుతం రాజకీయాలలోనే కొనసాగుతుంది. రోజా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఏపీ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉంటుంది.

Advertisement

minister-rk-roja-daughter-anshumalika-shares-selfie-video

Advertisement

అయితే రోజా డైరెక్టర్ సెల్వమని ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు. అందులో అన్షు మాలిక ఒకరు. అయితే ఇటీవల అన్షు మాలిక తన పుట్టినరోజు సందర్భంగా ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.తన 20వ పుట్టినరోజు సందర్భంగా ఆమె వీడియోలో మాట్లాడుతూ …..నా చిన్నప్పుడు బర్త్డే అంటే పెద్దగా పట్టించుకునే దానిని కాదు…కానీ ఇప్పుడు 20వ బర్త్డే మరి కొన్ని గంటల్లో వస్తున్నడంతో చాలా నర్వస్ గా ,ఎక్సైటీగా ఉంది అని చెప్పింది. ఇక ఈ వీడియోని చూసిన నేటిజనులు ఆమె ఇంగ్లీష్ పై కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో మాట్లాడవచ్చు గా అని కొందరు కామెంట్స్ చేయగా,

minister-rk-roja-daughter-anshumalika-shares-selfie-video

మంచు లక్ష్మికి చెల్లెలు దొరికిందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మంచు లక్ష్మీ లాగే ఇంగ్లీష్ మాట్లాడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంతకుముందు మంచు లక్ష్మి చేసిన ఇంగ్లీష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఎంతటి దుమారం లేపాయో తెలిసిందే. ఇక ఇప్పుడు అన్షు మాలిక చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అంతేకాక ఈ వీడియోలో అన్షు మాలిక లుక్ అభిమానులను కాస్త నిరాశ పరుస్తుంది. రోజా కూతురు అన్షు మాలిక త్వరలోనే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. టాలీవుడ్ ఎంట్రీ కి ఈ వయసు కరెక్ట్ అని కామెంట్స్ చేస్తున్నారు.. అయితే అన్షు మాలిక టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందో లేదో వేచి చూడాలి మరి.

Advertisement