Miss Shetty Mr Polishetty First Review : అనుష్క మరియు నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ సెప్టెంబర్ 7న థియేటర్లోకి రాబోతుంది . ఎన్నో సంవత్సరాల తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా ఇది. సరోగసి కాన్సెప్ట్ తో రొమాంటిక్ ఎంటర్టైర్నర్ గా రూపొందించిన ఈ సినిమా కు మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ ఆలస్యం కావడం పలుమార్లు రిలీజ్ డేట్ వాయిదాలు పడడంతో ఈ సినిమాపై పెద్దగా ఇంట్రెస్ట్ కనబడడం లేదు. అంతేకాక సినిమా ప్రమోషన్స్ కి అనుష్క శెట్టి దూరం కావడం కూడా మైనస్ గా మారింది.
కానీ మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాని ప్రమోట్ చేయడం ఈ చిత్రానికి కాస్త ఊరాట కల్పించింది. అవును స్వయంగా చిరంజీవి గారు ఈ సినిమాను చూసి తన ఫస్ట్ రివ్యూ ని అందించారు. ఈ విధంగా తనదైన స్టైల్ లో ఈ సినిమాను ప్రమోట్ చేశారు. ఇక కుర్ర హీరోలను ఎప్పుడూ ఎంకరేజ్ చేసే చిరంజీవి ఈ సినిమాను చూసి వెంటనే ట్విట్టర్లో తన రివ్యూ ను తెలియజేశారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా చూశానని మొదటి నుండి చివరిదాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్ ఎంటర్టైనర్ అలాగే నేటి యువత ఆలోచనలను చూపించే విధంగా సరికొత్త కథతో వచ్చారని తెలియజేశారు. జాతి రత్నాలు సినిమాకి రెట్టింపు ఎనర్జీని వినోదాన్ని అందించిన నవీన్ పోలిశెట్టి కాస్త గ్యాప్ తీసుకున్న తర్వాత ఈ సినిమాలో మరింత ఆకట్టుకున్నారని తెలియజేశారు.
ఈ సినిమాకు అనుష్క శెట్టి మరియు నవీన్ ప్రాణం పోసారని తెలియజేశారు. ఫుల్ లెన్త్ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్స్ ను కూడా అద్భుతంగా కలిపి చూపించిన డైరెక్టర్ మహేష్ బాబును అభినందించాల్సిందే అని చెప్పుకొచ్చారు. అంతేకాక ఈ సినిమాకు తొలిప్రేక్షకుడిని నేనే అని ఈ సినిమాను ఎంతగానో ఎంజాయ్ చేశానని మరోసారి థియేటర్లో ప్రేక్షకుల తో కలిసి సినిమా చూస్తానని తెలియజేశారు. ఇక ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని చిరంజీవి తెలియజేశారు. దీంతో ప్రస్తుతం చిరంజీవి చేసిన వ్యాఖ్యలు మిస్ శెట్టి మిస్టర్ పులి శెట్టి సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యాయని చెప్పాలి.