Samantha : సినీ రంగానికి మరియు రాజకీయ రంగానికి ఎంతో అభినవభావ సంబంధం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఎప్పటి నుండో సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు చాలామంది ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తర్వాత తిరిగి రాజకీయ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు రాజకీయ రంగంలోకి అడుగు పెట్టి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో త్వరలోనే ఓ స్టార్ హీరోయిన్ రాజకీయాల్లోకి రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో హీరోయిన్ సమంత ఒకరు. సమంత కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ క్రమంలో సమంత తమ పార్టీలోకి వస్తే ఎంతో బాగుంటుందని భావించిన తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ సమంతను తమ పార్టీ లోకి చేర్చుకునేందుకు చూస్తున్నట్లుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ప్రచార కార్యకర్తగా వ్యవహరిస్తే ఆమెకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్ అవుతుందని పార్టీ నేతలు అనుకుంటున్నట్లుగా సమాచారం. అయితే ఇప్పటివరకు సమంత చేనేత కార్మికులకు , రైతులకు మద్దతుగా నిలబడి వారికి ఎంతో సహాయం అందించింది.ఈ క్రమంలోని సమంత రాజకీయాల్లోకి వస్తే తమ పార్టీకి మంచి జరుగుతుందని బిజెపి వర్గాలు అనుకుంటున్నాయి.అయితే ఇలా వస్తున్న వార్తలను సమంత అభిమానులు పూర్తిగా ఖండిస్తున్నారు. ఆమెకు రాజకీయ రంగంలోకి వచ్చే ఆసక్తి లేదని , కేవలం ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతుందని , ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దు అంటూ సామ్ అభిమానులు మండిపడుతున్నారు. మరి ఈ వార్తలు పై సమంత స్పందిస్తే కానీ అసలు నిజం ఏంటో తెలియదు.