Mohan Babu – Chandra Mohan : చంద్రమోహన్ తో మోహన్ బాబు గొడవ… అందుకే ఆయనను చూడటానికి రాలేదా .. ??

Mohan Babu – Chandra Mohan  : సీనియర్ నటుడు చంద్రమోహన్ కి తెలుగు పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపు ఉంది. హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించిన చంద్రమోహన్ చాలామంది స్టార్ హీరోలతో సన్నిహితంగా ఉండేవారు. ముఖ్యంగా ఆయన సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు లతో చాలా క్లోజ్ గా ఉండేవారట. ఇక ఈయనతో సినిమాలు చేయడానికి హీరోయిన్లు చాలా ఆసక్తి చూపించే వారట. ఎందుకంటే ఈయనతో సినిమాలు చేస్తే ఆ హీరోయిన్ల లక్ మారుతుందని అప్పట్లో అంటూ ఉండేవారుష ఈ క్రమంలోనే చాలామంది హీరోయిన్లు చంద్రమోహన్ తో సినిమాలు చేసి స్టార్లుగా రాణించారు.

Advertisement

mohan-babus-fight-with-chandramohan-thats-why-he-didnt-come-to-see-him

Advertisement

అయితే ఒకానొక సమయంలో ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇస్తున్న మోహన్ బాబు కి చంద్రమోహన్ కి మధ్య చిన్న గొడవ జరిగిందట. చంద్రమోహన్ చేయాల్సిన సినిమా ఒకటి మోహన్ బాబు చేస్తున్నాడు అని ఉద్దేశంతో మోహన్ బాబు పై చంద్రమోహన్ కొన్ని వ్యాఖ్యలు చేశారట. దీంతో మోహన్ బాబు కూడా చంద్రమోహన్ పై సీరియస్ అయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొద్ది రోజులకు ఇద్దరు కలుసుకున్నారు. చాలా సినిమాలలో కూడా కలిసిన నటించడం జరిగింది. మోహన్ బాబు కి కోపం ఎక్కువగా ఉండటం వలన మిగతా హీరోలతో కూడా ఆయన కొంచెం దురుసుగానే ప్రవర్తిస్తూ ఉండేవారు. ఈ క్రమంలోనే చంద్రమోహన్ తో కూడా చిన్న గొడవ జరిగిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

రీసెంట్గా చంద్రమోహన్ మరణించడం జరిగింది. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. ఈయన మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఇక చంద్రమోహన్ అంత్యక్రియలు సోమవారం జరిగాయి. ఫిలింనగర్లోని చంద్రమోహన్ నివాస స్థలం నుంచి పంజాగుట్ట స్మశాన వాటిక వరకు ఆయన అంతిమయాత్ర కొనసాగింది. ఈ యాత్రలో కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సైతం పాల్గొన్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థించారు.

Advertisement