Bandla Ganesh : బండ్లన్నా.. ఏందన్నా ఇది.. అయ్యప్ప మాలలో ఉండి ఇలా చేస్తారా..??

Bandla Ganesh : కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ బండ్ల గణేష్. నిత్యం ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. ఇక ఆయన ట్విట్టర్ లో వేసే ట్వీట్లు కొన్ని వివాదాలకు దారి తీస్తుంటాయి. ఈ క్రమం లోనే ఆయన ఏది చేసినా నెట్టింట వైరల్ గా మారుతుంది. ప్రతి ఏటా ఆయన దీపావళి పండుగ ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ ఉంటారు. ఊరందరికీ సరిపడా క్రాకర్స్ ను తన ఇంటికి తీసుకొస్తాడు బండ్లన్న. ఇక వాటిని ఇంటి ముందు పేర్చి ఓ ఫోటోను నెట్టింటా వదులుతారు. లక్షల విలువైన క్రాకర్స్ తో బండ్లన్న దీపావళి సెలబ్రేషన్ చేసుకుంటారు.

Advertisement

అయితే ఈసారి బండ్లన్న అయ్యప్ప మాలలో ఉన్నారు. ఇక పండుగ సందర్భంగా క్రాకర్స్ పేలుస్తూ ఫోటోలు చేశారు. అయితే ఆ ఫోటోలో బండ్ల గణేష్ అయ్యప్ప మాలలో ఉండి చెప్పులు ధరించారు. అయ్యప్ప దీక్షలో ఉండి బండ్ల గణేష్ ఇలా కాలికి చెప్పులు వేసుకున్నాడు ఏంటి అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. బండ్ల గణేష్ టపాసులు కాల్చి రచ్చ రచ్చ చేసినట్లుగా కనిపిస్తున్నారు. ఇక ఈ ఫోటోలో ఫోజులు, కాలికి చెప్పులు ఉండటం చూసి జనాలు నోరెళ్ల పెడుతున్నారు. బండ్ల గణేష్ ఇలా అయ్యప్ప దీక్షలో ఉండి కాలికి చెప్పులు వేసుకోవడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Advertisement

ఇకపోతే బండన్న ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఎక్కువగా రాజకీయాల కు సంబంధించిన వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈమధ్య ఎన్నికల ఫీవర్ లో భాగంగా బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. ఈసారి కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుందని ఆయన అన్నారు. అయితే బండ్ల గణేష్ గత ఎన్నికల్లో చేసిన వ్యాఖ్యలు, నవ్వుల పాలైన తీరు అందరికీ గుర్తుండే ఉంటుంది. మధ్యలో రాజకీయాలను వదిలేసినట్టుగా చెప్పారు కానీ మళ్ళీ రాజకీయాలలోకి వచ్చారు. ఈసారి కాంగ్రెస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని నమ్మకంగా చెబుతున్నారు.

Advertisement