Mahalakshmi : కోలీవుడ్ హీరోయిన్ మహాలక్ష్మి ఒకప్పుడు ఫేమస్ కాలేదు కానీ ఎప్పుడైతే నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ ను పెళ్లి చేసుకుందో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. అంత లావుగా, బరువుగా ఉన్న నిర్మాతను ప్రేమించి ఏరి కోరి రెండో పెళ్లి చేసుకోవడంతో అందరూ ఆమె ప్రేమను శంకించారు. డబ్బు కోసమే నిర్మాతను పెళ్లి చేసుకుందని చెప్పుకొచ్చారు. డబ్బు కోసమే ప్రేమ పేరుతో రవీందర్ ను వలలో వేసుకుందని చాలామంది విమర్శించారు. అయితే ఎవరు ఏమన్నా సరే పట్టించుకోని ఈ జంట ఒక ఏడాది పాటు వారి వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడిపారు. ఇక ఈ ఏడాదిలో నిర్మాత రవి చందన్ మహాలక్ష్మికి ఖరీదైన బహుమతులను ఇచ్చి సర్ప్రైజ్ కూడా చేశాడు.
అదేవిధంగా మహాలక్ష్మి కూడా రవీందర్ కు కొన్ని కానుకలను అందజేసింది.అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. ఇటీవల ఓ చీటింగ్ కేసులో రవీందర్ జైలుకు వెళ్లాడు. ఇక నిర్మాత అరెస్టు కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. భర్త జైలుకు వెళ్లడంతో మహాలక్ష్మి బాధతో కూమిలిపోతూ ఉంటుందని అందరం అనుకున్నారు. కానీ మహాలక్ష్మి అందుకు విరుద్ధంగా సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ హ్యాపీగా గడుపుతున్న క్షణాలను షేర్ చేసింది. దీంతో అవి కాస్త హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాక తాజాగా మహాలక్ష్మి తన భర్త పై సంచలన వ్యాఖ్యలు చేసింది. రవీందర్ తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని తన సన్నిహితులతో చెబుతుందని సమాచారం. పెళ్లికి ముందు రవీందర్ ఇలాంటి విషయాలు నాకేం చెప్పలేదు.
చీటింగ్ కేసులు డబ్బు విషయాలు మా మధ్య రాలేదు. అవేమీ నాకు చెప్పకుండా అబద్ధాలు చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని సన్నిహితులతో ఆమె చెబుతున్నట్లు తెలుస్తోంది. దీంతో తమిళ్ అభిమానులు ఆమె వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు. డబ్బు ఉన్నంతకాలం సైలెంట్ గా ఉండి ఇప్పుడు అతను జైల్లో ఉండగా మోసం చేశాడని చెప్పడం భావ్యం కాదని , ఇలా చేస్తే రవీందర్ ను తాను కచ్చితంగా డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నట్లు అనుకుంటారని పలువురు చెప్పుకొస్తున్నారు. దీంతో ప్రస్తుతం మహాలక్ష్మి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.