Hari Teja : భర్తతో విడాకులు తీసుకోబోతున్న బుల్లితెర యాంకర్ హరితేజ…అసలు నిజం ఇదే…

Hari Teja  : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెరపై మరియు వెండితెరపై తనదైన ముద్రను వేసుకున్న యాంకర్ హరితేజ తెలుగు వారికి సుపరిచితమే . అయితే హరితేజ ఆన్ స్క్రీన్ పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా చాలా చాలాకీ గా ఉంటుంది. వెండితెరపై తన యాక్టింగ్ తో అందరినీ ఆకర్షించే ఆమె బుల్లితెర ఎంటర్టైన్మెంట్ షోలలో తన పంచ్ డైలాగులతో అందర్నీ కడుపుబ్బ నవ్విస్తుంది. అంతేకాక సటైరికల్ కామెంట్స్ తో ఇంచుమించు మరో సూర్యకాంతం లాగా పేరు సంపాదించుకుంది. అందుకే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఆమెకు అఆ సినిమాలో ఛాన్స్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత బిగ్ బాస్ లో అడుగుపెట్టిన హరితేజ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచింది.

Advertisement

hari-teja-gives-clarity-on-her-divorce

Advertisement

అయితే హరితేజ 2015లో కన్నడకు చెందిన దీపక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇక వీరికి 2021 లో భూమి అనే కూతురు జన్మించింది. అయితే బిడ్డ పుట్టిన తర్వాత బరువు పెరిగిన హరితేజ ఎంతో కష్టపడి బరువు తగ్గడమే కాకుండా చాలా స్లిమ్ గా తయారైంది. ఇక ఇప్పుడు సినిమాల్లో నటిస్తూనే బుల్లితెరపై రానిస్తుంది హరితేజ. ఈ క్రమంలో ఇటీవల హరితేజ విడాకులు తీసుకుపోతున్న అన్న వార్తలు ప్రచారం జరిగాయి. అలాగే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఆస్ట్రేలియాలో సింగిల్ గానే వెకేషన్ ఎంజాయ్ చేస్తుండడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయింది.

hari-teja-gives-clarity-on-her-divorce

అంతేకాక సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించకపోవడంతో మరిన్ని పుకార్లు వెలుగులోకి వచ్చాయి. అయితే చాలా రోజుల తర్వాత అభిమానులతో చిట్ చాట్ ప్రారంభించిన హరితేజ ను ఒక నేటిజన్ మీ భర్త దీపక్ తో విడాకులు తీసుకున్నారా అని అడిగాడు. ఇక దీనికి హరితేజ నవ్వుతూ చాలా హుందాగా తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చింది. నాలుగు రోజులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోతే మనిషిని కూడా చంపేసేలా ఉన్నారే అంటూ తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసి విడాకుల వార్తలకు పులిస్టాప్ పెట్టింది.

Advertisement