Colour photo : కలర్ ఫోటో సినిమాపై నాని ప్రశంసలు, చాలా గర్వంగా ఉంది అంటూ ట్వీట్…

Colour photo : తెలుగు సినిమా స్థాయి ఏంటి అనేది రాజమౌళి చేసిన బాహుబలి సినిమాతో దేశమంతా తెలిసిపోయింది. అదేవిధంగా చిన్న సినిమా అయినటువంటి కలర్ ఫోటో 68వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడంతో తెలుగు ఇండస్ట్రీ పై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. 68వ జాతీయ చలనచిత్ర వేడుకలు మన తెలుగు చిన్న సినిమా అయినటువంటి కలర్ ఫోటో జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా పురస్కారం అందుకుంది.

చిన్న సినిమాగా తెలుగు ఓటిటీ  అహలో రిలీజ్ అయ్యిన చిన్న సినిమా జాతీయస్థాయిలో అవార్డుగా ఎంపీక కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. పిరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా సందీప్ రాజ్ డైరెక్షన్లో హీరోగా సుహాస్ షార్ట్ ఫిలిం హీరోయిన్ గా చేసినటువంటి చాందిని చౌదరి హీరోయిన్ గా నటించగా పవర్ఫుల్ పోలీస్ విలన్ క్యారెక్టర్ లో సునీల్ కనిపించారు.

Colour photo : కలర్ ఫోటో సినిమాపై నాని ప్రశంసలు, చాలా గర్వంగా ఉంది అంటూ ట్వీట్…

nani appreciation tweet for colorphoto movie unit
nani appreciation tweet for colorphoto movie unit

ఒక లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమా కరోనా పాండమిక్ కారణంగా ఆహా ఓటీటీ లో రిలీజ్ అయ్యి ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేసింది. సినిమా చూస్తున్నంత సేపు లవ్ మరియు ఎమోషనల్ తో ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు జాతీయస్థాయిలో ఉత్తమ సినిమాగా అవార్డు రావడంతో నాచురల్ స్టార్ నాని కలర్ ఫోటో సినిమా టీం ను అభినందిస్తూ తన ట్విట్టర్ లో ఈ సినిమాకు జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు రావడం చాలా సంతోషంగా మరియు గర్వంగా ఉందని ట్వీట్ చేశారు.