Naresh – Pavitra Lokesh : గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో నరేష్ , పవిత్రల గురించి వస్తున్న వార్తల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ ఎన్నో రోజుల నుంచి కలిసి సహజీవనం చేస్తున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. అంతేకాదు ఇటీవల ‘ మళ్ళీ పెళ్లి ‘ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వారిద్దరి జీవిత కథ అంశం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 26వ తారీఖున విడుదల అయింది. ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు కానీ నరేష్ పవిత్రల రిలేషన్షిప్ మాత్రం అందరికీ తెలిసిపోయింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో వీరిద్దరు చేసిన బోల్డ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అసలైతే చాలామంది సెలబ్రిటీలు వ్యక్తిగత జీవితం గురించి బయటికి చెప్పాలంటే భయపడతారు. కానీ నరేష్, పవిత్రలు అలా కాదు. ప్రతిదీ చాలా ఓపెన్ గా చెప్పేస్తున్నారు. పెళ్లి విషయమే కాదు ఏకంగా పిల్లల్ని కనడంపై కూడా తమ అభిప్రాయాన్ని చెప్పేశారు. ఇప్పటికీ పవిత్రతో కలిసి పిల్లలు కనడంతో తప్పేమీ లేదని నరేష్ అంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్ పిల్లల్ని కనడంపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను పవిత్ర శారీరకంగా ఫర్ఫెక్ట్ గా ఉన్నామని చెప్పాడు. ఇప్పటికీ మేము మెడికల్ గా పిల్లల్ని కనొచ్చు. అయితే ఇప్పుడు మేము పిల్లలను కంటే నాకు 80 ఏళ్లు వచ్చేసరికి పుట్టే బిడ్డకి 20 ఏళ్లు వస్తాయి. అలా అవసరమా, అందుకే భార్యాభర్తలుగా మేము కలిసి ఉంటాం అని చెప్పుకొచ్చాడు.
ఇంకా నరేష్ మాట్లాడుతూ పవిత్ర పిల్లలు, నా పిల్లలు ఇద్దరు మా బిడ్డలే అనుకుంటాం. మాకు ఇప్పుడు ఐదు మంది పిల్లలు ఉన్నారని బ్రతుకుతున్నాం. ఇకపోతే నా దృష్టిలో బ్లడ్ రిలేషన్ షిప్ కంటే ఎమోషనల్ రిలేషన్షిప్ చాలా గొప్పది అని భావిస్తున్నాను. మా నాన్న కృష్ణ గారిని చూస్తే మా అమ్మ కనిపించేది. ఆయన పోయిన తర్వాత కుప్పకూలిపోయాను. మానసికంగా చాలా కృంగిపోయాను. పవిత్రలో మా అమ్మ విజయనిర్మల గారు కనిపించారు. ఆమె కళ్ళు పవిత్ర కళ్ళు ఒకేలా ఉంటాయి. మా ఇద్దరి పిల్లలను చూసుకుంటూ ఆనందంగా లైఫ్ ని గడుపుతామని నరేష్ చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా ఈ వయసులో పవిత్ర నరేష్ లు పెళ్లి చేసుకోవడం అందరికీ షాకింగ్ గా ఉంది. కొందరు అయితే ప్రేమకు వయసు లేదు, ప్రేమ గుడ్డిది, నడ్డిది అంటూ సరదాగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.