ఆ సీనియర్ నేతలందరికీ కేసీఆర్ ఝలక్

తాము తప్పుకొని వారసులకు టికెట్ ఇప్పించుకోవాలని లాబియింగ్ చేస్తున్న నేతలకు కేసీఆర్ షాక్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో వారసులకు టికెట్ ఇచ్చేది లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. పలువురి నేతల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిశీలించిన కేసీఆర్.. వారసులకు బీఆర్ఎస్ టికెట్ ఇస్తే పార్టీని వారసత్వ పార్టీగా అభివర్ణించే అవకాశం ఉంటుందని సూచించారు. బీఆర్ఎస్ ఇప్పటికే కుటుంబ పార్టీగా ముద్రపడింది..దీనికితోడు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల వారసులకు టికెట్ ఇస్తే పార్టీ అస్తిత్వం దెబ్బతినే ప్రమాదం ఉందని కేసీఆర్ భావిస్తున్నారు.

Advertisement

స్పీకర్ గా ఉన్న నేత గెలవరనే సెంటిమెంట్ ఉన్నప్పటికీ కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డినే పోటీ చేయాలనీ కేసీఆర్ ఆదేశించారు. బాన్సువాడ నుంచి తాను తప్పుకొని తన కుమారుడిని బరిలో దించాలని పోచారం అనుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం అలా కుదరదని చెబుతున్నారు. వయోభారంను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ ను పోచారం కోరినా, లేదు మీరే పోటీ చేయాలడంతో పోచారం అంగీకరించక తప్పలేదు.

Advertisement

telangana cm kcr challenges to opposition parties on early elections

ఒక్క పోచారం శ్రీనివాస్ రెడ్డి మాత్రమే కాదు.చాలామంది నేతలు తమ పిల్లలకు టికెట్లు ఇవ్వాలని అధినేతను కోరుతున్నారు. సమయం వచ్చినప్పుడల్లా ఈ అంశాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తున్నారు. కానీ ఇటీవల మాత్రం సీనియర్ నేతల వారసులకు టికెట్ విషయంలో కేసీఆర్ క్లారిటీ ఇచ్చేస్తున్నారు. వారసులను బరిలో దించాలని ఎవరూ భావించకండి..ఈసారి మీరే బరిలో ఉండాలని స్పష్టం చేస్తున్నారు. మంత్రి సబితా, గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి,మైనంపల్లి హన్మంతరావులు తమ , తమ వారసులకు టికెట్ ఇప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

కానీ కేసీఆర్ మాత్రం నిరాకరిస్తున్నారు. వారసుల విషయాలను తన వద్ద ప్రస్తావించవద్దని ముక్కుసూటిగా స్పష్టం చేస్తున్నారు. ఈసారి సీనియర్లే పోటీ చేయాలనీ చెబుతున్నారు.

Advertisement