Navdeep : హీరో నవదీప్ గురించి అందరికీ తెలిసిందే…సినిమాలలో సెకండ్ హీరోగా లేదా హీరోకి ఫ్రెండ్ గా ఉండే పాత్రలను ఎంచుకొని అలరిస్తూ ఉంటారు. ఇలా నవదీప్ ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు. ఇక హీరో ఫ్రెండ్ పాత్రలలో సెకండ్ హీరో పాత్రలలో ఆయన ఒదిగిపోతారని చెప్పాలి. అయితే ప్రస్తుతం నవదీప్ పేరు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీనికి గల కారణం ఇటీవల మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ పేరు బయటికి రావడం అని చెప్పాలి. ఇక ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలియజేశారు.
ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ ప్రస్తుతానికి నవదీప్ కానీ ఆయన కుటుంబం కానీ అందుబాటులో లేరని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కుటుంబంతో సహా పరారీలో ఉన్నాడని కమిషనర్ తెలియజేశారు. దీంతో హీరో నవదీప్ పరారీలో ఉన్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తనపై వస్తున్న వార్తలకు హీరో నవదీప్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను ఎక్కడికి పారిపోలేదని హైదరాబాదులోనే ఉన్నట్లుగా తెలియజేశారు. ఇక ఇదే సమయంలో బేబీ సినిమా ప్రస్తావన కూడా వెలుగులోకి వచ్చింది. బేబీ సినిమాపై సిటీ కమిషనర్ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు మాధకద్రవ్యాలను తీసుకునేందుకు ప్రోత్సహించేలా ఉన్నాయని ఆయన తెలియజేశారు. మూవీ మేకర్స్ బాధ్యతతో ఉండాలని , బేబీ సినిమా నిర్మాతలకు నోటీసులు జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే మాదాపూర్ డ్రగ్స్ కేసులో ముగ్గురు నైజీరియన్స్ తో పాటు ఒక సినీ నిర్మాత, ఒక మాజీ ఎంపీ కుమారుని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారింది.
That's not me gentlemen
I'm right here .. pls clarify thanks— Navdeep (@pnavdeep26) September 14, 2023