Chandrababu Naidu : చంద్రబాబు కొంపముంచిన ఫైల్ ఇదే…దానిలో ఏముందంటే…

Chandrababu Naidu : టిడిపి ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో సంబంధించి ఈ కేసులో ప్రధాన నిందితుడు ఏ వన్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని సిఐడి ప్రత్యేక దర్యాప్తు బృందం శనివారం నంద్యాలలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జర్మనీ కంపెనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో 3300 కోట్లు ప్రాజెక్టుకి ఒప్పందం కుదుర్చుకొని ఎలాంటి ప్రాజెక్టు చేపట్టకుండా నిబంధనలకు విరుద్ధంగా 371 కోట్లు విడుదల చేపించి దానిలో 241 కోట్లను కొల్లగొట్టిన ఆరోపణలతో చివరికి చంద్రబాబును అరెస్టు చేశారు. 2014 నుండి 2019 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాసిన ముఖ్యమైన నోట్ ఫైల్స్ కీలక సాక్షాలు అయ్యాయి.

Advertisement

this-is-the-file-bought-by-chandrababu-what-is-in-it

Advertisement

ఇక ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పని చేశారు. సెప్టెంబర్ 8 2015న ఒక ఫైల్ సీఎమ్ఓ నుంచి ఆర్థిక శాఖకు వచ్చింది. ఆ ఫైల్ వచ్చిన వెంటనే చీఫ్ సెక్రటరీ నుంచి ఆర్థిక శాఖ సెక్షన్ ఆఫీసర్ కు పిలుపు వచ్చింది. సెప్టెంబర్ 5 2015 ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం జరిగిందని చీఫ్ సెక్రటరీ తనకు వెల్లడించినట్లు ఆర్థిక శాఖ నోట్ ఫైల్ లో ఉంది. ఇక ఆ సమావేశానికి సంబంధించి మినిట్స్ కూడా పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి సీమెన్స్ కంపెనీ తో ఆగస్టు 21 2015న ఒప్పందం చేసుకున్నట్లు చీఫ్ సెక్రటరీ తనకు తెలిపారని ఆర్థిక శాఖ కార్యదర్శి దీనిలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇక దీనికి సంబంధించిన నిధులను 371 కోట్లను తక్షణమే విడుదల చేయాలని ఇది ముఖ్యమంత్రి తనకు ఇచ్చిన ఆదేశం అని చీఫ్ సెక్రటరీ పేర్కొన్నట్లు నోట్ ఫైల్ లో ఉంది.

this-is-the-file-bought-by-chandrababu-what-is-in-it

వీలైనంత త్వరగా ఎంఓయు కుదుర్చుకోవాలని సీఎం చెప్పినట్లు ఆర్థిక శాఖ వ్యవహారా లో పేర్కొన్నారు. ఆగస్టు 5 2015న ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పంపిన నోట్ పై అప్పటి సీఫ్ సెక్రటరీ స్వయంగా కొన్ని కామెంట్లు కూడా రాశారు. ఇక దానిలో ఏముందంటే అప్పటి ముఖ్య మంత్రి చంద్రబాబు కంపెనీ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశం చర్చల మేరకు నిధులను విడుదల చేసేందుకు అవసరమైన పత్రాలను విడుదల చేయాలి. దీనితోపాటు ఆగస్టు 25న 270 కోట్ల నిధులకు సంబంధించిన బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ను విడుదల చేసే ప్రతిపాదన తయారైంది. ఇక ఈ ప్రతిపాదనకు ఆగమేఘాల మీద ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. సీమెన్స్ కంపెనీకి నిధులను వెంటనే విడుదల చేసేలా ఒత్తిడి కూడా వెలువడ్డాయని తెలుస్తుంది.

Advertisement