Nayanathara : టాలీవుడ్ లో చిరంజీవి తో సినిమా అంటే ఎంత స్టార్ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. ఎందుకంటే చిరంజీవితో సినిమా అంటే ఏ హీరోయిన్ కైనా స్టార్ హోదా వచ్చేసినట్లే. అలానే చిరంజీవి సినిమాలో హీరోయిన్ సెలెక్ట్ చేయాలనే విషయంలో దర్శక నిర్మాతలు చాలానే కేర్ తీసుకుంటారు. అంతేకాకుండా హీరోయిన్స్ కూడా ఆ సినిమా హిట్ అయితే తర్వాత వచ్చే ఆఫర్లు మామూలుగా ఉండవని ఆ హీరోయిన్స్ కూడా అర్థమైపోతుంది. కానీ ఒక హీరోయిన్ మాత్రం చిరుతో చేయడానికి కొన్ని నియమాలు పెట్టిందట.
ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార కేవలం తెలుగులోనే కాకుండా మలయాళ తమిళ్ సినిమా పరిశ్రమలో చాలా బిజీగా ఉంటుంది. ఆమె వరుస సినిమాలతో ఎప్పుడు బిజీగా ఉంటూ ఈమధ్య కాలంలోనే తమిళ్ డైరెక్టర్ అయినటువంటి విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుంది. పెళ్లయిన తర్వాత కూడా ఈ అమ్మడి పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేదు. చేతినిండా సినిమాలతో చాలా బిజీగా మారిపోయింది. మలయాళం లో సూపర్ హిట్ అయినటువంటి లూసిఫర్ సినిమాకి రీమేక్ గా వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నయనతార చిరంజీవి చెల్లెలు క్యారెక్టర్ లో నటిస్తుంది.
Nayanathara : అవి వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే….
కాదా ఈ పాత్రకు చాలామంది హీరోయిన్లని ముందుగా అనుకోవడం జరిగింది. కాకుంటే వారందరి కంటే నయనతార బెటర్ అని భావించి ఈ సినిమా యూనిట్ వారు నయనతార ను ఫైనల్ చేశారట. అయితే చిరు చెల్లెలు పాత్రలో తాను నటించవని తేల్చి చెప్పేసిందట నయనతార. అంతేకాకుండా చిరంజీవి పర్సనల్ రిక్వెస్ట్ చేయగా ఒప్పుకుందట. కానీ ఈ సినిమాలో చేయడానికి చాలా షరతులే పెట్టిందని టాక్ . అవుట్డోర్ షూటింగ్స్ కి రాను అని, కాల్ షీట్స్ కూడా ఎక్కువగా ఇవ్వలేనని. పారితోషకం విషయం లో కూడా చాలా కండిషన్స్ పెట్టిందని టాక్. ఈ విషయం తెలిసిన మెగాస్టార్ అభిమానులు ఆమెపై ఫైర్ అవుతున్నారని చిరుతో సినిమాకి ఇన్ని షరతులు అవసరమా అని మెగాస్టార్ ఫ్యాన్స్ నయనతారపై ఫైర్ అవుతున్నారు.