Rashmika – Vijay : రష్మిక మందన్నాను ఇప్పుడు నేషనల్ క్రష్ అనాలి. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అనాలి. కేవలం పుష్ప సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది రష్మిక. నిజానికి.. రష్మికకు తన తొలి సినిమా ఛలోతో ఏమాత్రం గుర్తింపు రాలేదు కానీ.. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో తీసిన గీత గోవిందం సినిమాతో మాత్రం చాలా గుర్తింపు వచ్చింది. తను ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. తనకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఆ తర్వాత కూడా విజయ్ తో మరో సినిమాలో నటించింది కానీ.. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.
కట్ చేస్తే రష్మిక, విజయ్ దేవరకొండ ఇద్దరు మాత్రం డేటింగ్ లో ఉన్నారు.. ఇంకేదో రిలేషన్ షిప్ లో ఉన్నారు అంటూ వార్తలు షికారు చేశాయి. నిజానికి.. ఆన్ స్క్రీన్ మీద వాళ్ల రొమాన్స్ పండటానికి కూడా కారణం వాళ్ల రియల్ రిలేషన్ షిప్ అంటూ రూమర్స్ కూడా వచ్చాయి. మొత్తానికి ఇద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తోంది అంటూ వార్తలు వస్తున్నాయి.
Rashmika – Vijay : రష్మికకు పబ్లిక్ గానే ఐలవ్యూ చెప్పిన విజయ్
ఆ మధ్య కాఫీ విత్ కరణ్ షోలో విజయ్ దేవరకొండ.. పబ్లిక్ గానే ఐలవ్యూ చెప్పడం, ఇద్దరూ కలిసి డిన్నర్ అంటూ కలిసి తిరగడం, ఇద్దరూ మీడియా కంట పడటం ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా వీళ్ల మధ్య ఏదో ఉంది అనే అందరికీ అనుమానం కలిగింది. తాజాగా ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. దానికి కారణం.. లైగర్ సినిమా అంటూ చెప్పుకొస్తున్నారు. లైగర్ సినిమా ప్లాఫ్ అయినప్పటి నుంచి రష్మిక మందన్నా.. విజయ్ ని దూరం పెట్టిందట. ఆయన కాల్ చేసినా రెస్పాండ్ అవడం లేదట. తన మెసేజ్ లకు కూడా రిప్లయి ఇవ్వడం లేదట. అంతే కాదు.. ఆయన నెంబర్ కూడా రష్మిక బ్లాక్ చేసిందంటూ వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో ఇద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారు అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై అటు రష్మిక కానీ.. ఇటు విజయ్ కానీ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.