Nayanathara-Vignesh shivan : ఈ మధ్యకాలంలో నయనతార, విగ్నేష్ శివన్ వీరిద్దరూ వివాహం చేసుకొని చాలా సరదాగా గడుపుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే లేటెస్ట్గా నయనతార భర్త విజ్ఞేశ్ శివన్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ హాల్ చల్ చేస్తుంది. ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే విగ్నేష్ శివన్ కొన్నాళ్ల వరకు ప్రేమించి కొని వివాహం చేసుకొని ఎంతో హ్యాపీగా గడుపుతున్నారు. వీళ్లు రెండు మూడు హనీమూన్లు కూడా అవ్వగొట్టేశారు. అలాగే తాజాగా ఒక పుట్టినరోజును దుబాయ్ లో చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేశారు విగ్నేష్ శివన్. ఈ నేపథ్యంలో విగ్నేష్ రియాక్ట్ అవుతూ.. నువ్వు నాతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్న ఎనిమిదో బర్తడే ఇది.
ఇంకా ఇటువంటి బర్త్డేలు నేను నీతో చాలా చేసుకోవాలి అని ఆశపడుతున్నాను అంటూ.. వరల్డ్ లో ఎంతో ఎత్తయిన భవనంగా ఫేమస్ అయిన బుర్జా ఖలీఫ్ ముందు కేక్ కటింగ్ చేశారు. దానికి సంబంధించిన కొన్ని ఫిక్స్ సోషల్ మీడియాలో విగ్నేష్ పోస్ట్ చేశాడు. అవి ఇప్పుడు తెగ చెక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో దుబాయిలో ఒక షాపింగ్ మాల్ లో వాళ్ళిద్దరూ చాలా సరదాగా స్పెండ్ చేసిన క్షణాలు ఇంస్టాగ్రామ్ లో విగ్నేష్ శివన్ పోస్ట్ చేశాడు. అక్కడ కొందరి పిల్లలతో కొన్ని స్నాప్ లను దిగి వీళ్లు ఇనిస్టాలో పోస్ట్ చేశారు. ఫ్యూచర్ కోసం చాలా ప్రాక్టీస్ చేస్తున్న అంటూ.. టైటిల్ కూడా పెట్టారు.
Nayanathara-Vignesh shivan : ఓ మై గాడ్ పిల్లల కోసం ఇంత ప్రాక్టీసా…
ఇక దాంతో పలువురు నెటిజెన్స్ వారిదైన నీ స్టైల్ లో కామెంట్స్ పెట్టారు. మరికొందరు ఎప్పుడో రాబోయే పిల్లల కోసం ఈనాటి నుంచి ప్రాక్టీసా..? అంటున్నారు. ఇంకా పలువురు మీరు ఎప్పుడు ఇదే విధంగా పిల్లలతో హ్యాపీగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాం. తొందర్లో నయనతార శుభవార్త చెప్పాలని కోరుకుంటున్నాం అని వాళ్ళదైన స్టైల్ లో స్పందిస్తున్నారు. ఇలా దుబాయిలో సరదాగా జరుపుకున్న పుట్టినరోజు వేడుకను సోషల్ మీడియాలో నేటిజన్స్ తో సరదాగా పంచుకున్నారు. ఇక నయనతార ఎప్పుడు శుభవార్త చెప్తుందో ఎదురు చూడాలి..