Nayanathara : సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు దక్కించుకుంది నయనతార. మొదట్లో అల్లాటప్పగా కనిపించిన నయనతార, ఇప్పుడు పేరు చెప్తేనే స్టార్ హీరోలు కూడా భయపడిపోతున్నారు. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది నయన్. సౌత్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కి దక్కని అరుదైన గౌరవాన్ని నయనతార దక్కించుకుంది. ఆమె ప్రమోషన్స్ కి రాదు అన్న కోపం తప్పితే మిగతా అన్ని విషయాల్లో నయనతార సూపర్ అని పొగిడేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇటీవల నయనతార తాను ప్రేమించిన కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం రెండు హనీమూన్లు పూర్తి చేసుకొని మూడో హనీమూన్ కి రెడీగా ఉన్నారు.
అయితే రీసెంట్ గా నయనతార తన భర్త కోసం కారుని గిఫ్ట్ గా ఇచ్చింది. విగ్నేష్ శివన్ కి కారు అంటే చాలా ఇష్టం. బోలెడు కార్లను కలెక్ట్ చేసి పెట్టుకుంటారట. ఈ క్రమంలోనే విగ్నేష్ కి నయనతార అదిరిపోయే కార్ ను గిఫ్ట్ గా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై నేటిజన్స్ మరోలా స్పందిస్తున్నారు. నీకు ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఏం లాభం నయనతార.. నువ్వు అమ్మా అని పిలిపించుకోవడానికి ఆసక్తి చూపించట్లేదు. ఇంత ఆస్తి ఉన్న నువ్వు మీ వారు అనుభవించాల్సిందే.
Nayanathara : కోట్ల ఆస్తి ఉన్న ఏం లాభం…
ముందు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకో.. కోట్ల ఆస్తి ఉన్నా సరే అమ్మ అని పిలిపించుకోలేకపోతే వేస్ట్ అని, నయనతార జీవితంలో నువ్వు చేసిన తప్పులు చాలానే ఉన్నాయి. చాలామంది జీవితాలను నాశనం చేశావు. ఇప్పటికైనా ప్రశాంతంగా ఉండి ముందు ఓ బిడ్డకు తల్లి అవ్వు. ఆ తర్వాత నీ సినిమాలపై ఆసక్తి చూపించు అంటూ మధ్యలోకి విగ్నేష్ శివన్ ని కూడా లాగుతూ కాస్త నీ భార్యని పట్టించుకోరా నాయనా రోజురోజుకీ ఇలా తయారవుతుంది ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేనా హనీమూన్లకు వెళ్తున్నారు కానీ గుడ్ న్యూస్ చెప్పేది ఏమీ లేదంటూ సోషల్ మీడియాలో చెత్త కామెంట్స్ పుట్టిస్తున్నారు. దీంతో నయనతార పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.