Nayanathara : సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక వార్త వైరల్ అవుతుంది. అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారను ఫాలో అవుతుందా అంటూ సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. తాజాగా ఇండస్ట్రీలో జరుగుతున్న మార్పుల కారణంగా సమంత మరో సంచలన నిర్ణయానికి ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే నాగచైతన్యకు విడాకులు ఇచ్చేసి కుటుంబానికి దూరంగా ఉంటూ, కేవలం అమ్మతో తను బాధలను పంచుకుంటున్న సమంత గత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంది. దానికి కారణం ఓ బాలీవుడ్ హీరో అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయినా దానిపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం సమంత నటించిన యశోద, శాకుంతలం సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి.
Nayanathara : అప్పుడు నయనతార ఇప్పుడు సమంత…
అలాగే తెలుగులో ‘ ఖుషి ‘ అనే సినిమా కూడా చేస్తుంది. హాలీవుడ్ లో ఒక మూవీ, బాలీవుడ్ లో నాలుగు సినిమాల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీటన్నింటినీ ఒకేసారి ప్రకటించే ఆలోచనలో ఉందంట సమంత. ఈ మధ్యనే ఓ బాలీవుడ్ డైరెక్టర్ తన దగ్గరకు ఓ లెస్బియన్ స్టోరీ తీసుకెళ్లారట. దీంతో సమంత ఇదివరకు అయితే కచ్చితంగా ఈ సినిమాను చేసి ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నేను అలా చేయదలచుకోవడం లేదు. సమంత అంటే ఎప్పుడు ఎక్స్పోజింగ్ చేస్తుంది అనే భావన జనాల్లో ఉండిపోయింది. ఇప్పుడు దానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాను. ఇకపై గ్లామరస్ రోల్స్ చేయను అంటూ చెప్పేసిందంట.

అయితే ఇలాగే నయనతార కూడా పెళ్లి తర్వాత గ్లామరస్ రోల్ లో నటించకూడదని నిర్ణయించుకుందని ఇప్పటికే ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పెళ్లి తర్వాత నయనతార, విడాకుల తర్వాత సమంత తమ లైఫ్ ని మరింత డౌన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే స్టార్ హీరోయిన్స్ గా ఉన్న వీరిద్దరూ ఎక్స్పోజింగ్ చేస్తేనే జనాలు చూడాలనుకుంటారు. అంతేకానీ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలోనే చేస్తే వాళ్ల క్రేజ్ తగ్గిపోవచ్చు. గ్లామరస్ రోల్ చేయాలి, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయాలి ఒక్కదాన్నే చేస్తా ఉంటే హీరోయిన్గా సక్సెస్ అవ్వలేరు అంటూ నెటిజెన్స్ విమర్శిస్తున్నారు.