Allu Aravind – Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీకి మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ రెండు కళ్లు లాంటివి. వాళ్లు ఇండస్ట్రీ పెద్దలు. అందుకే వాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి.. మెగాస్టార్ చిరంజీవి సినిమా హీరోగా నిలదొక్కుకున్నాక.. మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు వచ్చారు. నిర్మాతలు వచ్చారు. మెగా ఫ్యామిలీ నుంచి ఎంత మంది ఇండస్ట్రీకి వచ్చినా.. అందరూ మెగాస్టార్ చిరంజీవి తర్వాతే. మరోవైపు అల్లు రామలింగయ్య ఫ్యామిలీలో అల్లు అరవింద్ నిర్మాతగా సెటిల్ అవ్వగా.. తన కొడుకు అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.

అల్లు రామలింగయ్య కూతురును పెళ్లి చేసుకోవడం వల్ల.. మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య సంబంధం ఏర్పడింది. అప్పటి నుంచి ఈ రెండు ఫ్యామిలీల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. రెండు కుటుంబాలు ఎప్పుడు కలిసినా సరదాగా, సందడిగా కనిపిస్తాయి. కానీ.. ఈ మధ్య రెండు ఫ్యామిలీల మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు గుప్పుమన్నాయి. రెండు కుటుంబాలు కలుసుకోవడం లేదని.. రెండు కుటుంబాల మధ్య వచ్చిన విభేదాల వల్ల ఒకరిని మరొకరు కలుసుకోకుండా దూరంగా ఉంటున్నారనే వార్తలు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి.
Allu Aravind – Chiranjeevi : ఆ పుకార్లకు పుల్ స్టాప్ పెట్టిన అల్లు అరవింద్
మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీకి మధ్య విభేదాలు ఏంటి అనే దానిపై నిర్మాత అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. మా కుటుంబాల మధ్య విభేదాలు వచ్చాయన్న వార్తలు అవాస్తవం అని ఆయన కొట్టిపారేశారు. మొదటి నుంచి ఉన్న బంధుత్వమే తమ మధ్య ఉందన్నారు. మా కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఎవరి స్టార్ డమ్ వాళ్లకు వచ్చిన తర్వాత ఇలాంటి వార్తలు వస్తాయి. ఇప్పుడు వాళ్లంతా పిల్లలు కాదు.. పెద్దవాళ్లయ్యారు. సినిమా స్టార్లు అయ్యారు. షూటింగ్స్ లో బిజీగా ఉంటారు. అన్ని సార్లు కలుసుకునే అవకాశం రాకపోవచ్చు. కానీ.. ఏదైనా పండుగ వచ్చినా.. ఫంక్షన్ వచ్చినా ఖచ్చితంగా అందరూ కలుస్తారు. అందరూ సరదగా గడుపుతారు. కావాలని కొందరు తమ రెండు ఫ్యామిలీలపై రాళ్లు విసురుతున్నారు. ఇదంతా కావాలని కొందరు పనిగట్టుకొని చేస్తున్న ప్రచారం తప్పితే ఇందులో ఎలాంటి నిజం లేదని అరవింద్ ఫుల్లు క్లారిటీ ఇచ్చేశారు.