Nayanthara : సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది హీరోయిన్ నయన తార. దాదాపుగా 17 ఏళ్లు గా విభిన్నమైన సినిమాలు చేస్తూ టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఇటీవల కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుంది. అయితే తాజాగా అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పిందంట. దక్షిణ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. తెలుగు, మలయాళ, తమిళ భాషలో చిత్రాలు చేసి సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ గా పేరు దక్కించుకుంది. ఇక తాజాగా ఆమె బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కు జోడిగా జవాన్ అనే సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. ఇదే కాకుండా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా నటిస్తుంది. అలాగే తమిళంలో గోల్డ్ అనే సినిమా ఈ నెల 8న విడుదల కానుంది.
Nayanthara : ఫ్యాన్స్ లో పెరిగిన టెన్షన్…
ఇవే కాకుండా మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోని నయనతార షాకింగ్ నిర్ణయం తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె తన యాక్టింగ్ కెరీర్ కు గుడ్ బై చెప్పనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం తన చేతిలో ఉన్న రెండు సినిమాలు పూర్తి చేశాక తన యాక్టింగ్ కు స్వస్తి పలుకుతుందని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే నయనతార యాక్టింగ్ కెరీర్ కు గుడ్ బై చెప్పి బిజినెస్ మాన్ గా మారాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులు ఇతర రంగాల్లో పెట్టనున్నట్లు తెలుస్తుంది

అంతేకాకుండా కొన్ని సినిమాలను కూడా నిర్మించాలని నయనతార భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ పుకార్లు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో నయనతార ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారట. టాలీవుడ్ లో మొదటగా గ్లామరస్ పాత్రలతో ఆకట్టుకున్న నయన్, తర్వాత నటన ఉన్న పాత్రలు చేసి శభాష్ అనిపించుకుంది. ఇక సౌత్ లోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ గా నయనతార పేరు నిలిచింది. ఇటీవల కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్న పెళ్లి చేసుకుందాం విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేసిన కణ్మణి రాంబో ఖతీజా సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇందులో నయనతార తో పాటు స్టార్ హీరోయిన్ సమంత, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించారు.