Mrunal Thakur : అప్పుడు అలా… ఇప్పుడు ఇలా.. ఏంటి.? అని మృణాల్ ఠాకూర్ పైమండిపడుతున్న నేటిజన్స్..

Mrunal Thakur : గత కొంతకాలం నుండి బాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు మృణాల్ ఠాకూర్. ఈ ముద్దుగుమ్మ 2012లో సీరియల్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 2014లో రిలీజ్ అయిన “విట్టి దండు” అనే సూపర్ సక్సెస్ మరాఠీ సినిమాతో సినిమాల్లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత లవ్ సోనియా సినిమాతో బాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో ఓ పల్లెటూరి అమ్మాయిగా తను న్యాచురల్ గా అభిమానుల్ని ఎంతగానో అలరించింది. ఇక ఈ మూవీ తర్వాత బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను చేజిక్కించుకుంది ఈ అమ్మడు. ఇక తాజాగా సీతారాం సినిమాతో మళ్లీ టాలీవుడ్ లోకి వచ్చింది. హను రాఘవ పూడి దర్శకత్వంలో నిర్వహిస్తున్న ఈ మూవీని వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ స్వప్న దత్ సంయుక్తంగా నిర్వహించారు.

Advertisement

ఈ మూవీలో దుల్కర్ సల్మాన్, మృనాల్ కలిసి చేశారు. అదేవిధంగా అందాల ముద్దుగుమ్మ రష్మిక, సుమంత్ తరుణ్ భాస్కర్ తదితరులు ముఖ్యమైన పాత్రలో చేశారు. ఈ మూవీ ఎన్నో అంచనాలతో ఆగస్టు 5న తమిళ్, తెలుగు, మలయాళం భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ అభిమానుల్ని బాగా ఆకట్టుకుంది. దీనిలో సీతామాలక్ష్మి పాత్రని చేసిన మృనాల ఠాగూర్ మైమరిపించే అందంతో తన నటనతో అభిమానుల్ని బాగా అలరించింది. ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరు మృనాల్ ఠాగూర్ ని పొగడ్తలతో ముంచి వేశారు. ఈ అమ్మడును పొగిడిన వారి ప్రస్తుతం చివాట్లు పెడుతున్నారు.. దానికి కారణం ఏంటంటే.. సీతారామ్ మూవీలో ఎంతో సాంప్రదాయంగా అచ్చ తెలుగు అమ్మాయిల తెరకి పరిచయమైన మృణాలు సోషల్ మీడియా లో విపరీతమైన హాట్ ఫోటోలలో కనిపిస్తోంది.

Advertisement

Mrunal Thakur : అప్పుడు అలా… ఇప్పుడు ఇలా..

netizens  fires on Mrunal Thakur Then and now
netizens  fires on Mrunal Thakur Then and now

సీత పాత్రలో సాంప్రదాయంగా కనిపించి మంచి ఇమేజ్ తెచ్చుకున్న ఈమె ఇప్పుడు అందాల ఆరబోత షో చేయడం చాలా మందికి అస్సలు నచ్చడం లేదు.. దానిలోను మృణాల్ లేటెస్ట్ గా చేసిన ఘాటైన షూట్ ఫోటోలను సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో మృణాలపై పలువురు నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. సీతామాలక్ష్మి పాత్రలో ఎంతో సాంప్రదాయంగా తెరపై కనిపించిన మృణాలు ఈ విధంగా హాట్ ఫోటోషూట్ చేయడం అస్సలు బాగాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలురైతే నోటికి అదుపు లేకుండా కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా మూవీ ఇండస్ట్రీలో ఎక్కువకాలం నిలబడాలి అంటే.. కేవలం నటన మాత్రమే కాదు.. అందం కూడా అందర్నీ ఆకర్షించాలి. సుమారు 90 శాతం హీరోయిన్లు ఇలానే పాటిస్తూ ఉంటారు. మృణాళిని ఈ విధంగా చూసిన తర్వాత ఆమె అందాల ఆరబోతును అందరూ తట్టుకోలేకపోతున్నారు.

Advertisement