Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ఛాన్స్ కోసం ఇద్దరు హీరోయిన్ల ఫైటింగ్… ఎవరికి దొరుకుతుందో మరి అవకాశం…

Jr NTR : ఇప్పుడు ఫ్యాన్ ఇండియా లెవెల్ లో జూనియర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ మూవీతో మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరోగా మారిపోయాడు. అంతేకాకుండా ప్రస్తుతం రెండు సినిమాలను ఫ్యాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్ తో కొరటాల శివ చేస్తున్న ఎన్టీఆర్ 30 ప్రాజెక్టు షూటింగ్ ప్రారంభం కాగా కేజిఎఫ్ ఇంకా సలార్ సినిమాల దర్శకుడు ప్రశాంతి నిల్ తన 31వ చిత్రంగా ఎన్టీఆర్ చేయబోతున్నాడు. అయితే కొరటాల శివ తో చేసే ఎన్టీఆర్ థర్టీ ప్రాజెక్టులో హీరోయిన్ కోసం చాలానే అన్వేషణ జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ కోసం చాలామంది పేర్లే వినిపిస్తున్నాయి. ఆచార్య సినిమా రిజల్ట్ తో కొరటాల శివ ఈ సినిమాని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతుంది.

Advertisement

ఇది ఎన్టీఆర్ ఫ్యాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో ఏ విషయంలోనూ రాజీ పడడం లేదు. అయితే ఈ సినిమా హీరోయిన్ విషయంలో చాలా చర్చలు నడుస్తున్నట్లుగా సమాచారం. వీరిద్దరూ బాలీవుడ్ హీరోయిన్లు రావడం విశేషం. భరత్ అనే నేను సినిమాలో వసుమతి క్యారెక్టర్ చేసిన కియరా అద్వానీ ని ఈ సినిమాతో తెలుగులో మంచి హిట్ ని అందుకుంది. ఆ తరువాత రామ్ చరణ్ తో చేసిన వినయ విధేయ రామ అంత సక్సెస్ కాలేదు. కాగా కియరా అద్వానికి తెలుగుతోపాటు నార్త్ లో కూడా చాలా క్రేజ్ ఉంది. ఈ అమ్మడుకు కొరటాల శివతో భరత్ అనే నేను సినిమా చేసిన అనుభవం ఉంది. మొదట ఈమెని అనుకోగా తరువాత మరో బాలీవుడ్ హీరోయిన్ అయినటువంటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ పేరు కూడా ఈ సినిమా కోసం అనుకున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

Jr NTR : ఎవరికి దొరుకుతుందో మరి అవకాశం…

these two heroins are fighting for acting with ntr movie chance
these two heroins are fighting for acting with ntr movie chance

కాగా బోనీ కపూర్ కూడా తన కుమార్తెను టాలీవుడ్ లో పరిచయం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జాన్వీ తో సరైన జోడి కోసం ఎదురుచూస్తున్నట్లుగా సరైన కామినేషన్ దొరికితే ఈ అమ్మడిని తెలుగులో పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే కొరటాల అటు చీరతో ఇటు జాహ్నవితో ఇద్దరితో చర్చల్లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే త్వరలో వీరిద్దరి విషయంలో ఓ క్లారిటీ వచ్చేటట్లుగా కనిపిస్తుంది. వీరి ఇరువురిలో ఒక హీరోయిన్ ఫైనల్ అయితే సినిమా వచ్చేనెల సెట్స్ పైకి తీసుకెళ్లే ప్లానింగ్ చేస్తున్నారట సినిమా యూనిట్. చూడాలి మరి ఇద్దరి హీరోయిన్ లో ఎన్టీఆర్ సరసన నటించబోయేది ఎవరో అని.

Advertisement