Niharika Konidela : మెగా డాటర్ నిహారిక కొణిదెల మొదటగా యాంకర్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు. యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఆ తర్వాత హీరోయిన్ గా వెండితెరకి పరిచయమయ్యారు. కానీ హీరోయిన్గా అంతగా సక్సెస్ కాలేకపోయారు. దీంతో సినిమాలకు దూరమైపోయిన నిహారిక 2020లో జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కొద్ది కాలం బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి ఏప్రిల్ లో నాంపల్లి హైకోర్టులో విడాకులు అప్లై చేశారు. జూన్ నెలలో విడాకులు వచ్చాయి.
ఈ విషయాన్ని నిహారిక ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేసి అందరికీ షాక్ ఇచ్చారు. అప్పటినుంచి నిహారిక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. విపరీతంగా ట్రోలింగ్ కూడా ఎదుర్కొంటున్నారు. ఇక విడాకుల తర్వాత నిహారిక కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఫోటోలు పోస్టులతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఆమె విడాకులు తీసుకున్న దగ్గర నుంచి ఆమె సోషల్ మీడియాలో ఏం చేసినా అది వైరల్ గా మారుతుంది.
View this post on Instagram
ప్రస్తుతం నిహారిక నిర్మాతగా , పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ, సినిమాను నిర్మించే పనిలో ఉన్నారు. అయితే తాజాగా నిహారిక తన ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియోను పోస్ట్ చేసారు. తనకు అత్యంత ఇష్టమైన వారిని, తన జీవితంలో ప్రేరణగా నిలిచిన వారికి సర్ప్రైజ్ ఇచ్చింది. వాళ్లతో గడిపిన క్షణాలు జీవితంలో మర్చిపోను అని చెప్పుకొచ్చారు. ఆ ఒక్క వీడియోలో అందరూ వచ్చేలా పోస్ట్ చేశారు. వీడియో తో పాటు లవ్ లెటర్ టూ ఆల్ మై ఏంజెల్స్ అని క్యాప్షన్ పెట్టారు. అందులో లావణ్య, శ్రీజ, వితికా, మోనాల్, జ్యోతిరాయ్, నిహారిక తల్లి పలువురు ఉన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్ లు లవ్ సింబల్ షేర్ చేస్తున్నారు.