Sai Dharam Tej : ఆ విషయంలో నిర్మాతకు గట్టి కౌంటర్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ ..

Sai Dharam Tej  : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెలుగు పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్నారు. సుప్రీం హీరోగా పేరు తెచ్చుకున్న సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. తన ఫ్యాన్స్ తో అభిమానులతో కూల్ గా ఇంటరాక్ట్ అవుతారు. అయితే సాయి ధరమ్ తేజ్ ఇండస్ట్రీకి వచ్చి 9 ఏళ్ల అవుతున్న సందర్భంగా నిన్న ట్విట్టర్ లో తన ఫాలోవర్స్ తో చాట్ చేశారు. ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు సాయి ధరమ్ తేజ్ తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే కొంతమంది నెటిజన్లకు కౌంటర్లు పడ్డాయి.

Advertisement

saidharamtej-strong-counter-to-producer

Advertisement

అంత స్పీడ్ గా సమాధానం చెప్పే క్రమంలో మిస్టేక్స్ జరుగుతుంటాయి. రిపబ్లిక్ స్పెల్లింగ్ తప్పు పడింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ సాయి ధరమ్ తేజ్ మీద కౌంటర్ వేశారు. మీ స్కూల్లో స్పెల్లింగ్స్ నేర్పించలేదా అని కౌంటర్ వేస్తే, దీనికి సమాధానంగా తేజ్ మీ స్కూల్లో మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం నేర్పించలేదా అని కౌంటర్ వేశారు. అలా కొంతమందికి కౌంటర్లు పడ్డాయి. అలాగే ఓ నెటిజన్ 10 లక్షలు కావాలి అని అడిగితే షాక్ అవుతూ నవ్వుతూ ఉన్న బ్రహ్మానందం జిప్ ఫైల్ ని షేర్ చేశాడు. మరో నెటిజన్ మీ పెళ్లెప్పుడు అని అడిగారు. దీనికి తేజ్ నీ పెళ్లి అయిన వెంటనే నాది అని పంచ్ వేశారు.

ఇలా నెటిజన్ లు రకరకాల ప్రశ్నలు వేశారు. వీటికి తేజ్ తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చారు. అయితే నిర్మాత, మెగా అభిమాని అయిన అహితేజ కూడా సాయిధరమ్ తేజ్ ని పెళ్లి గురించి అడిగారు. ఫ్యామిలీ క్లబ్ లోకి ఎప్పుడు వస్తావు అని ఎదురు చూస్తున్నట్లుగా ట్వీట్ వేశాడు. దానికి తేజ్ నువ్వు ఫోన్ మాట్లాడకుండా ఎప్పుడు డ్రైవ్ చేస్తావా అని ఎదురు చూస్తున్నాను అని అనేశాడు. తేజ్ వేసిన కౌంటర్ కి అహితేజ రిప్లై ఇస్తూ అన్నా ఇంకోసారి ఇలా డ్రైవ్ చేయను అని దండం పెట్టేసాడు. ఇలా నిర్మాత అహితేజ కి సాయి ధరమ్ తేజ్ తనదైన స్టైల్ లో కౌంటర్ వేశారు.

Advertisement