NTR 31 : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈయన ఎనర్జీ లెవెల్స్ అన్లిమిటెడ్. అది RRR మూవీ చూస్తే ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. తన ఎనర్జీకి తగ్గట్టుగానే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న NTR 31 కోసం అన్ని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న సినిమా ముగింపు దశలో ఉంది ఆ సినిమా పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ డీఎల్ రోలు చేస్తూ భారీ యాక్షన్ డ్రామాలో సినిమా తెరకెక్కుతున్నట్లుగా సినిమా వర్గాలు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా మరో కీలకపాత్రలో ముందుగా లోకనాయకుడు కమలహాసన్ పేరు వినిపించింది. ఇప్పుడు విక్రమ్ భారీ కలెక్షన్లతో దూసుకుపోవడంతో కమలహాసన్ అరోల్ చేయడానికి నిరాకరించడం జరిగిందని టాక్ వినిపిస్తుంది. ప్రశాంతిని ఒకటి రెండుసార్లు కమలహాసన్తో ఈ పాత్ర గురించి చర్చలు జరిపినప్పటికీ కమలహాసన్ తిరస్కరించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
NTR 31 : ఎన్టీఆర్ 31 కి సంబంధించి క్రేజీ అప్డేట్స్

అయితే ఎన్టీఆర్ ఇంతకుముందు జనతా గ్యారేజ్ లో తనతో చేసిన మోహన్ లాల్ ని ఈ కీలక పాత్రలో దించనున్నట్లు తెలుస్తుంది. ఈ కాంబో మళ్లీ తిరగడంతో సినీ వర్గాల్లో ఎన్టీఆర్ 31 పై భారీ అంచనాలు పెరిగిపోయినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రశాంత్ నీళ్ళు ప్రభాస్ తో చేస్తున్న ప్రాజెక్ట్ లో అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రశాంతిని మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ అనగానే ఈ సినిమాకు నేషనల్ లెవెల్ లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇన్ని కలిసొచ్చే అంశాల మధ్య ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో పాటు ఇప్పుడు మోహన్ లాల్ కలవడంతో సెంటిమెంట్ గా కలిసొస్తుందని అనుకున్నట్లు తెలుస్తుంది.