Health Care : ప్రస్తుతం ఉన్న ఆరోగ్య సమస్యల్లో క్యాన్సర్ భయంకరమైనది. క్యాన్సర్ నివారణకు అనేక పరిశోధనలు జరిగాయి. రావి చెట్టు బెరడు నిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడుతుంది. అంతేకాకుండా జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రావి చెట్టులో ఉండే సమ్మేళనాలు క్యాన్సర్ కణాలను చంపుతాయని పరిశోధనలు చెబుతున్నారు. పూర్వకాలం నుండి రావిచెట్టును ఎంతో పవిత్రమైన చెట్టుగా భావిస్తున్నారు.
రావి చెట్టు ఆకులు ,మొదలు, వేర్లు కాండం, బెరడులో అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. దెబ్బ తగిలిన గాయాలకు రావి ఆకుల రసం రాస్తే త్వరగా తగ్గిపోతుంది. ఈ రసంలో గాయాన్ని తగ్గించే ఔషధగుణాలు ఉన్నాయి. ఈ ఆకుల రసం వాపు, నొప్పి నివారణ గా పనిచేస్తుంది. రావి చెట్టు బెరడు రసం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. రావిచెట్టు వేరుల్లో సిటోస్టరోల్ డి గ్లైకోసైడ్ అనే సమ్మేళనం రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడుతున్న ట్లు అధ్యయనాలల్లో తెలిసింది.
Health Care : రావి చెట్టు క్యాన్సర్ కు దివ్య ఔషధంగా పనిచేస్తుందా?

రావి చెట్టు బెరడు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. రావిచెట్టు ఆకులు ,కాండం ,బెరడు మొదలు క్యాన్సర్ కణాలను చంపుతాయి అని పరిశోధనలు చెబుతున్నారు. ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని తగ్గించడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తాయి. రావి చెట్టు పలురకాల క్యాన్సర్ల నివారణకు సహాయపడుతుంది . రావి చెట్టును ఔషధంగా తీసుకునేటప్పుడు తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. రావి చెట్టు ఔషధం గా తీసుకునేటప్పుడు పలురకాల ఆయుర్వేద వైద్యులను సంప్రదించవలసి ఉంటుంది