Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ సీజన్ సెవెన్ 5 వారాలను పూర్తిచేసుకుని ఆరో వారంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే హౌస్ లోకి కొత్త హౌస్ మేట్స్ కూడా రావడం జరిగింది. అయితే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ అందరూ ఇష్టపడేది ఇమ్యూనిటీ కాగా అందరూ భయపడేది మాత్రం ఎలిమినేషన్ కి… ఎందుకంటే ఇమ్యూనిటీ వస్తే అసలు నామినేషన్ లోకి రారు. ఇక అప్పుడు ఎలిమినేషన్ అనే ఆలోచన కూడా వారి మనసులో రాదు. ఇక ఆ ఇమ్యూనిటీ అనేది సులభంగా లభించేది కెప్టెన్ కు మాత్రమే.అందుకే బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్స్ అందరూ కెప్టెన్సీ కోసం ఎంతో కష్టపడుతుంటారు.
ఈ నేపద్యంలోనే తన ఆటను చాలా బాగా ఆడి ఈ సీజన్ లో తొలి కెప్టెన్ గా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ అవతరించారు. నువ్వెంత అని చులకనగా చూసిన వాళ్ళని ఓడించి కెప్టెన్గా గెలిచి చప్పట్లు కొట్టించుకున్నాడు. కానీ కెప్టెన్సీ పగ్గాలు చేతికి వచ్చిన తర్వాత మాత్రం సైలెంట్ అయిపోయాడు. ఒక కెప్టెన్ గా ఎవరి పనులను వారికి చెబుతూ..ఇల్లును చూసుకోవడం, నాయకుడిగా వ్యవహరించడం ప్రశాంత్ చేయలేకపోయాడు. ఎవరు ఏ తప్పు చేసిన చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. తన పని తాను చేసుకుపొవడంతో గమనించిన బిగ్ బాస్ ఎట్టకేలకఓ చర్యలకు ఉపక్రమించింది.
ఈ నేపథ్యంలోనే ఇటీవల విడుదలైన ప్రోమో లో బిగ్ బాస్ కెప్టెన్సీ అర్థమేంటని హౌస్ లోని వారందరినీ అడిగింది. అనంతరం బాడ్ కెప్టెన్ అనుకుంటున్నారు చేతులెత్తమని అడగగా దాదాపు హౌస్ లోని వారంతా చేతులెత్తేశారు. దీంతో ప్రశాంత్ కెప్టెన్సీని రద్దు చేసినట్లుగా అర్థమవుతుంది. దీంతో ఎంతో కష్టపడి సాధించిన కెప్టెన్సీ ఇలా మూడు నాళ్ళ ముచ్చటగా మారడంతో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కంటతడి పెట్టుకున్నారు. ఈ క్రమంలోని కెప్టెన్సీ భాడ్జి ని బిగ్ బాస్ వెనక్కి తీసేసుకుంది. ఇక దీనికి సంబంధించిన ఎపిసోడ్ ఈరోజు రాత్రి ప్రసారం కానుంది.