Chandrababu Health : అనారోగ్యం బారిన పడిన చంద్రబాబు…జైల్లో సరైన వసతులు లేకపోవడమే కారణమా…

Chandrababu Health  : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా ఎక్కడ విన్న చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్టుపై టిడిపి అభిమానులు మరియు నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. చంద్రబాబుది అక్రమ అరెస్టుని ఆధారాలు లేకుండానే కేసు నమోదు చేసి చంద్రబాబును అరెస్టు చేశారని టిడిపి అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు భార్య భువనేశ్వరి మరియు కోడలు బ్రాహ్మణి కూడా రాజమండ్రిలోనే ఉంటూ చంద్రబాబు రిలీజ్ అవ్వడానికి వారికి తోచిన విధంగా ధర్నాలు చేస్తున్నారు. అలాగే జైల్లో చంద్రబాబుకు సరైన వసతులు కల్పించడం లేదని ఒక విఐపి కి మాజీ ముఖ్యమంత్రి కి ఇవ్వాల్సిన గౌరవం,

Advertisement

chandrababu-fell-ill-is-it-because-of-lack-of-proper-facilities-in-jail

Advertisement

కల్పించాల్సిన సౌకర్యాలు ఏమి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. అలాగే చంద్రబాబు కు కనీసం ఫ్యాన్ వసతి కూడా లేదని, స్నానం చేయడానికి వేడి నీళ్లు వసతి కూడా ఇవ్వడం లేదని చంద్రబాబు ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో తాజాగా చంద్రబాబు ఆరోగ్యంపై కీలక అప్డేట్ విడుదలైంది. అయితే ప్రస్తుతం ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో రాజమండ్రిలో కూడా తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలో పెరిగాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు కనీసం ఫ్యాన్ వసతి కూడా లేకపోవడంతో ఆయన డిహైడ్రేషన్ కు గురైనట్లు తెలుస్తోంది.

chandrababu-fell-ill-is-it-because-of-lack-of-proper-facilities-in-jail

ఇక ఈ విషయాన్ని వైద్యులు కూడా చెప్పారట. అయితే ఈ విషయాలను తన కుటుంబ సభ్యులతో ఇటీవల జరిగిన ములఖాత్ లో చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో చంద్రబాబు ఆరోగ్యం సరిగా లేదని ఆయనకి సరైన సౌకర్యాలు కల్పించడం లేదని ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందని ఇప్పటికైనా సరైన సౌకర్యాలు కల్పించాల్సిందిగా కుటుంబ సభ్యుల డిమాండ్ చేస్తున్నారు.ఇకనైనా ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను మానుకోమని హెచ్చరిస్తున్నారు.

Advertisement