Pavithra Puri : పూరి జగన్నాథ్ తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. అయితే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తో పూరి జగన్నాథ్ లైగర్ సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ సినిమా పూరి జగన్నాథ్ కెరీర్ లోని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. అంతేకాకుండా చాలా ఎక్కువ సమయం తీసుకుని ఈ సినిమాను నిర్మించారు. అందరు బిజీగా ఉండగా పూరి జగన్నాథ్ కూతురు పవిత్ర సోషల్ మీడియాలో ఒకటి పోస్ట్ చేసింది. ఆమె పోస్టులో తన తండ్రిపై ఎంత నమ్మకంగా ఉందో అర్ధమయ్యేలా చేసింది. పూరి జగన్నాథ్ కు తన కూతురు అంటే చాలా ఇష్టం. పవిత్ర గతంలో ప్రభాస్ ‘ బుజ్జిగాడు ‘ సినిమాలో చిన్నప్పటి త్రిష పాత్రలో నటించింది.
పవిత్ర పూరి సోషల్ మీడియాలో ఈ విధంగా తన వివరణ ఇచ్చింది. నాన్న ఇప్పుడు నువ్వు నా ఫేవరెట్ లవ్. నేను ఎప్పుడూ కూడా ఇంత నర్వస్ గా ఫీల్ కాలేదు. ఎందుకంటే ‘ లైగర్ ‘ విడుదల రోజు నీకు ఒక బిగ్ డే. ఈరోజు కోసం నువ్వు చాలా కష్టపడ్డావు. కష్టానికి తగ్గ ఫలితం రాబోతుంది. ఏదేమైనా ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి. మేము మీ ప్రతి విషయంలో కూడా చాలా గర్వంగా ఉంటాము అని పేర్కొన్నారు. కొత్తగా ఏవైనా అవకాశాలు అందుకోవాలి. రిస్క్ చేయడానికి కూడా భయపడకూడదు అని నేర్చుకున్నాను. నిన్ను ఎన్నో విషయాల్లో ఆదర్శంగా తీసుకున్నాను. ‘ లైగర్ ‘ మూవీ టీం మొత్తం కూడా ఎంతగా హార్డ్ వర్క్ చేసిందో ఎంతగా స్ట్రగుల్ అయ్యారో కూడా మాకు తెలుసు. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలి అని టీం మొత్తానికి కూడా గుడ్ గుడ్ లక్ అని తెలిపారు.
Pavithra Puri : ఎమోషనల్ అయినా పూరి జగన్నాథ్ కూతురు…

నువ్వే నా ధైర్యం. నువ్వే నా బలహీనత. ఈ సినిమా చూసేటప్పుడు నువ్వు రేపు మా దగ్గర ఉండకపోవచ్చు. కానీ సినిమా చూస్తున్నంత సేపు కూడా ఆ ఆనందం విజిల్స్ లో కూడా నన్ను చేరుకుంటాయి. నేను సినిమా చూసేందుకు ఆగలేక పోతున్నాను. ఎల్లప్పుడూ నిన్ను ఎంతో గాను మేము ప్రేమిస్తూనే ఉంటాము అని పవిత్ర పూరి వివరణ ఇచ్చారు. ఈరోజు భారీ బడ్జెట్లో నిర్మించిన లైగర్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాను చూసిన కొందరు సూపర్ గా ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు చెత్త సినిమా అని కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా విజయ్ దేవరకొండ కంటే పూరి జగన్నాథ్ కి ఎక్కువ ఇంపార్టెంట్. ఇక కొన్ని రోజులు చూడాలి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో.