Viral Video : నిత్య జీవితంలో మనం రకరకాల వ్యక్తులతో స్నేహం చేస్తూ ఉంటాం. సృష్టిలో స్నేహాన్ని మించింది మరి వేరేది ఏదీ లేదు. ఏ స్వార్థం లేకుండా మనల్ని ప్రేమిస్తూ ఆపదలో ఆదుకుంటూ ఉండేవాడే నిజమైన స్నేహితుడిగా మనకు గుర్తుండిపోతాడు. ఇప్పుడు మనం చూడబోయే వైరల్ వీడియోలు ఇతను ఇతను ఎవరితో దోస్తీ చేశాడో చూస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు. డీన్ ష్నీడర్ అనే వ్యక్తి ఏకంగా సింహంతోనే దోస్తీని కట్టి వాటితో ఎంతో ఆప్యాయంగా రోజంతా గడుపుతూ ఉన్నాడు.
ఈ వీడియోలో డీన్ ష్నీడర్ వాటితో ఒక స్నేహితుడిగా కలిసిపోయి వాటితో ఆడే సయ్యాటను చూస్తే ప్రతి ఒక్కరికి ముచ్చటేస్తుంది. మనం సాధారణంగా కుక్కలతో పిల్లలతో ఇంకా ఆవులతో మనం ఆప్యాయంగా ఉంటూ ఉంటాం. కానీ వీటన్నిటికీ భిన్నంగా దోస్తీ నీ చూసిన వాళ్ళందరూ వీడు మగాడ్రా బుజ్జి అని సోషల్ మీడియాలో అనేక కామెంట్లు చేస్తున్నారు. అడవిలో పెరిగే క్రూర జంతువులైన సింహాల మందతోనే ఇతను స్నేహం చేస్తూ ఏకంగా అడవిలోనే వాటితో మకాం పెట్టేశాడు.
Viral Video : ఏకంగా వీడు సింహలతోనే దోస్తీ చేస్తున్నాడు…
వాటితో కలిసి జీవిస్తూ ఇప్పుడు అతను వైరల్ గా మారాడు. అతని సోషల్ మీడియాలో వాటితో చేసిన వీడియోలను అప్లోడ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇది చూసిన ప్రేక్షకులు అతని సాహసానికి ఆశ్చర్యపోయి ఈ వీడియోని లైక్ చేస్తూ అనేక రకాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. మీకు మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి.