Tollywood : సీనియర్ నటికి ఇంత క్రేజ్ నా… హీరోయిన్ కి కూడా ఇంత లేదుగా…

Tollywood : సీనియర్ నటి పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడలో సినీ రంగప్రవేశం చేసిన పవిత్ర తెలుగు, తమిళ భాషల్లో కూడా నటిస్తుంది. ప్రస్తుతం స్టార్ హీరో హీరోయిన్లకు అత్తా లేదా తల్లి పాత్రలో నటిస్తూ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తుంది. అయితే తాజాగా మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ రామారావు ఆన్ డ్యూటీ ‘ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాను శరత్ మండల దర్శకత్వం వహించారు. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ అయింది.

సినిమా ఎలా ఉందనే సంగతి పక్కన పెడితే పవిత్ర లోకేష్ ఇంట్రడక్షన్ సీన్ కి థియేటర్లో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్ తో కలిసి పవిత్ర లోకేష్ ఓ సన్నివేశంలో కనిపించింది. దీంతో ప్రేక్షకులు ధియేటర్లో ‘ ఓ అంటూ అరుపులు ఈలలతో గోల గోల చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ల ఎంట్రీకి కూడా ఇంత రెస్పాన్స్ రాలేదు. నిజం చెప్పాలంటే రవితేజ ఇంట్రడక్షన్ సీన్ కి కూడా ఆ స్థాయిలో అరుపులు రాలేదు. కానీ పవిత్ర లోకేష్ రాగానే ఆడియన్స్ నుంచి భారీ స్పందన వచ్చింది.

Tollywood : సీనియర్ నటికి ఇంత క్రేజ్ నా… హీరోయిన్ కి కూడా ఇంత లేదుగా…

Pavitra lokesh got suden craze on tollywood  
Pavitra lokesh got suden craze on tollywood

దానికి కారణం వ్యక్తిగత జీవితంపై వచ్చిన వివాదాలే అని చెప్పాలి. పవిత్ర గత కొంతకాలంగా నరేష్ తో సహజీవనం చేస్తుందని ఈ మధ్య వార్తలు వచ్చాయి. నరేష్ పవిత్ర సినిమాలో నటించటమే కాదు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్లడంతో వీరి వ్యవహారంపై అనేక రూమర్స్ వచ్చాయి. సీరియల్ నటీనటులు ఇద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. మైసూర్ లోని ఓ హోటల్ గదిలో వీరిద్దరూ కలిసి ఉండటం ఇందులో నరేష్ మూడో భార్య ఎంట్రీ ఇవ్వడంతో ఈ వివాదం మరింతగా పెరిగింది.

ఈ క్రమంలో ఇటీవల కొన్ని రోజులపాటు సోషల్ మీడియాలో పవిత్ర నరేష్ బంధం గురించి పెద్ద చర్చ జరిగింది. అందుకనే ‘ రామారావు ఆన్ డ్యూటీ ‘ సినిమాలో ఆమె కనిపించగానే ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. వాస్తవానికి పవిత్ర విషయంలో జరిగిన వివాదం ఆమె సినీ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని అందరు అనుకున్నారు. దీని వలన ఆమెకు చాలా సినిమాలు కూడా దూరమయ్యాయి. కానీ ‘ రామారావు ఆన్ డ్యూటీ ‘లో పవిత్ర సీన్ కి వస్తున్న స్పందన చూస్తుంటే ఆమెకు ఇంకా క్రేజ్ పెరిగిందనే చెప్పాలి.