Pawan Kalyan: రేణు దేశాయ్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన బద్రి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. అంతకుముందే ఆమె కోలీవుడ్లో హీరోయిన్గా నటించింది. తెలుగులో మాత్రం బద్రి సినిమా ఆమెకు మొదటి సినిమా. బద్రి తర్వాత పవన్ కళ్యాణ్ ప్రేమలో పడిపోయిన రేణు పవన్తోనే సహజీవనం చేస్తూ వచ్చింది. అప్పటికే మొదటి భార్యకు దూరంగా ఉంటున్న పవన్ రేణుతో సీక్రెట్ గా ప్రేమాయణం నడుపుతూ వచ్చాడు. పవన్ కళ్యాణ్ దర్శకత్వం చేసిన జానీ సినిమాలో హీరోయిన్ గా రేణునే నటించింది. ఇదే ఆమెకు చివరి సినిమా. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు.
పవన్ కళ్యాణ్ తో పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు అయ్యాక విడాకులు తీసుకున్న ఆ తర్వాత ఆమె సినిమాల వైపు చూడలేదు. రేణు దేశాయ్ కు విడాకులు ఇచ్చేశాక పవన్ తీన్ మార్ సినిమాలో నటించిన రష్యన్ మోడల్ అన్న లెజ్నోవాను మూడో భార్యగా చేసుకున్నారు. రేణు తనకు కలిగిన ఇద్దరు పిల్లల కెరీర్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు. విడాకుల తర్వాత పవన్ రేణు పిల్లల కోసం చాలా సార్లు కలుస్తున్నారు. అప్పుడప్పుడు పూనే కూడా వెళ్లి వస్తుంటారు. విడాకుల తర్వాత పవన్ రేణుతో సన్నిహితంగా ఉండడం వల్లే మూడో భార్యతో కాస్త గ్యాప్ వచ్చిందని గుసగుసలు ఇనిపిస్తున్నారు.
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ని వెంటాడుతున్న రేణు జ్ఞాపకాలు…

అయితే ఇప్పుడు రేణు మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న సినిమాతో టాలీవుడ్ లోకి రీయంట్రీ ఇవ్వబోతుంది. రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటిస్తున్నాడు. టైగర్ నాగేశ్వరరావు అనే స్టువర్ట్ పురం దొంగ జీవిత చరిత్ర సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇస్తుండడంతో పవన్ అభిమానుల్లో ఇండస్ట్రీ వర్గాల్లో కొత్త చర్చ నడుస్తుంది. పవన్ రేణు మళ్లీ దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయని, పవన్ మదిలో రేణు జ్ఞాపకాలు మళ్లీ మొదలవుతాయని పవన్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. రేణు మళ్లి పవన్ జీవితంలోకి రావాలని కోరుకుంటూ ఉంటారు