Payal Rajput : మంగళవారం హిట్ తో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన పాయల్…

Payal Rajput  : తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు ఇండస్ట్రీలో వారికంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకునేందుకు వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంటారు. ఈ క్రమంలోనే ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాజ్ పుత్ పాయల్ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ సినిమా తర్వాత అమ్మడుకు మళ్ళీ అంతటి సక్సెస్ రాకపోయినా వరుసగా సినిమాలు చేస్తూ మంచి ఫామ్ లో కొనసాగుతుంది.

Advertisement

payal-who-got-a-chance-in-star-hero-with-mangalavaram-hit

Advertisement

అయితే తాజాగా ఆర్ఎక్స్ 100 సినిమా దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్ లో వచ్చిన మంగళవారం సినిమాలో పాయల్ లీడ్ రోల్ లో నటించింది. ఈ సినిమాతో పాయల్ మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు ఈ సినిమా సక్సెస్ తో ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో ఓ కీలక పాత్రకు చాన్స్ కొట్టేసింది. ఇక ఈ విషయాన్ని పాయల్ ఇటీవల జరిగిన మంగళవారం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలియజేసింది.

payal-who-got-a-chance-in-star-hero-with-mangalavaram-hit

ముందుగా అల్లు అర్జున్ ను ఉద్దేశించి చాలా రకాల కామెంట్స్ చేసిన పాయల్ దీనిలో భాగంగానే త్రివిక్రమ్ మరియు అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమాలో తనకు అవకాశం ఇస్తున్నట్లుగా తెలియజేసింది. దీంతో ఒక్కసారిగా రెండు సంతోషాలను పాయలు పంచుకుంది. ఒకటి మంగళవారం మూవీ హిట్ అవ్వడం అలాగే స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేయడం. ఇప్పటికైనా ఈ ముద్దుగుమ్మ సక్సెస్ వైపుగా వెళ్తుందేమో చూడాలి. అంతేకాక తమిళ్ ఇండస్ట్రీలోని పెద్ద హీరోల సినిమాలో కూడా ఈమెకు అవకాశాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement