Parijat Plant Benefits : చాలామందికి పారిజాత పుష్పాల గురించి తెలిసే ఉంటుంది. వీటిని దేవుని పూజ కోసం ప్రత్యేకంగా పెరట్లో పెంచుకుంటూ ఉంటారు. ఇక దీనిని నైట్ ఫ్లవర్ జాస్మిన్ అని కూడా పిలుస్తుంటారు. సుగంధ వాసనలను వెదజల్లే ఈ పారిజాత పుష్పాలు రాత్రి సమయంలో వికసించి తెల్లారేసరికి భూమిపై రాలి పడిపోతాయి. అయితే దైవారాధనకు సహజంగా చెట్టు నుండి తీసిన పుష్పాలను మాత్రమే ఉపయోగిస్తాం. కానీ పారిజాత పుష్పాలను మాత్రం చెట్టు నుండి అసలు కోయకూడదని పెద్దలు చెబుతుంటారు. వాటంత అవి భూమిపై రాలిన తర్వాతనే వాటిని దేవునికి సమర్పించాలి.
ఈ విధంగా దేవుని దగ్గర ఈ చెట్టు వరం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఇక ఈ చెట్టును స్వర్గలోకం నుండి సత్యభామ కోసం శ్రీకృష్ణుడు తీసుకువచ్చినట్లుగా కథనాలు కూడా మనం వింటూనే ఉన్నాం.అయితే ఈ పారిజాత వృక్షం లోఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..పారిజాత గింజలను ఎండబెట్టి మెత్తగా పొడి చేసుకుని ఆ పొడిలో కొంచెం నీటిని కలిపి పేస్టులా తయారు చేసుకుని తలకు పట్టించినట్లయితే తలపై వచ్చిన పొక్కులు తగ్గిపోతాయి. అలాగే పారిజాత గింజల చూర్ణాన్ని కొబ్బరి నూనెతో కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత తల స్నానం చేయాలి.
ఇలా చేయడం వలన చుండ్రు సమస్య ఉన్నవారు వెంటనే ఈ సమస్య నుండి బయటపడతారుు. అలాగే పారిజాత ఆకులను మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని ఆముదంలో కలిపి సన్నని సెగపై వేడి చేసిన నొప్పులున్న చోట రాసుకున్నట్లయితే ఆ నొప్పులన్ని వెంటనే మటుమాయం అయిపోతాయి. అలాగే చెవి పోటు సమస్యతో బాధపడే వారికి పారిజాత ఆకుల రసాన్ని నాలుగు చుక్కలు చెవిలో వేసినట్లయితే వెంటనే తగ్గిపోతుంది.
గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించాం. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. యువతరం దీనిని ధ్రువీకరించలేదు.