Pooja Hegde : హీరోయిన్ పూజ హెగ్డే మెగా హీరో వరుణ్ తేజ్ తో ‘ ముకుంద ‘ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా హిట్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే ప్రస్తుతం పూజ హెగ్డే డేంజర్ లో ఉందని చెప్పాలి. ఎందుకంటే వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. తన తోటి హీరోయిన్స్ కి మంచి హిట్స్ వస్తు క్రేజీ ప్రాజెక్ట్స్ అవకాశాలు దక్కుతున్నాయి. ముఖ్యంగా రష్మిక మందన, కృతి శెట్టి లాంటి వారి దెబ్బను తట్టుకోలేక పోతుంది. ఇండస్ట్రీలో హీరోయిన్ గా వచ్చిన చాలా కాలానికి హిట్స్ వచ్చాయి. వచ్చిన ఏ సినిమా అవకాశాన్ని వదులుకోలేదు. ఈ క్రమంలోనే వరుసగా హిట్స్ పడ్డాయి.
అలాగే పాన్ ఇండియా రేంజ్ లో వచ్చిన రాదే శ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. అయినా ఐటమ్ సాంగ్స్ కూడా చేసే అవకాశాన్ని వదలడం లేదు. ప్రస్తుతం పూజ హెగ్డే చేతిలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలు ఉన్నాయి. ఇవి రెండు సెట్స్ మీదకి రావాల్సి ఉంది. అలాగే పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ‘ జనగణమన ‘ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
Pooja Hegde : రష్మిక మందనల కృతి శెట్టి దెబ్బ తట్టుకోలేకపోతున్న పూజ…

పూరి, విజయ్ కలిసి చేసిన పాన్ ఇండియా లైగర్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీనికి ముందు మేకర్స్ చాలా నమ్మకాలు పెట్టుకొని మాట్లాడుకున్నారు. దాంతో హీరోయిన్ పూజ అయితే సూపర్ అని భావించారు. ఇప్పటికే ఈ సినిమా షెడ్యూల్ కూడా పూర్తయింది. అయితే లైగర్ ప్లాఫ్ వల్ల ఇప్పుడు జనగణమన సినిమా బడ్జెట్ ను పూర్తిగా తగ్గించారు. ఈ సినిమాకి పూజ చాలా ఎక్కువ రెమ్యూనరేషన్ అడిగితే ఓకే అన్నారట. ఇప్పుడేమో లైగర్ ఫ్లాప్ అయింది గా దీంతో పూజ రెమ్యునరేషన్ తగ్గించారట. ఒకవైపు రష్మిక రెమ్యూనరేషన్ పెరుగుతుంటే ఇలా పూజ రెమ్యూనరేషన్ తగ్గటం హాట్ టాపిక్ గా మారింది.