Viral Video : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బెంగళూరు గురించే చర్చ. బెంగళూరు వర్షాల గురించే చర్చ. ఇప్పటికీ వరుసగా వారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బెంగళూరు నగరం మొత్తం వరదమయం అయిపోయింది. ఎక్కడ చూసినా నీళ్లే. చివరకు ఇళ్లలోకి కూడా నీళ్లు చేరాయి. చాలా ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టినా కూడా ఇంకా వరద మాత్రం తగ్గడం లేదు.

ఈనేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి వామ్మో అంటూ నోరెళ్లబెడుతున్నారు. ఎందుకంటే బెంగళూరులోనే చాలా ఖరీదైన విల్లాలు ఎప్సిలాన్ విల్లాలు. ఆ విల్లాలలోకి కూడా వరద నీరు పోటెత్తింది.
Viral Video : విల్లాలోకి చేరిన మనిషి మునిగే అన్ని నీళ్లు
అయితే.. విల్లాలోకి మనిషి మునిగే అన్ని నీళ్లు చేరాయి. అది డుప్లెక్స్ హౌస్ కాగా.. కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మొత్తం నీళ్లు చేరాయి. ఈత రాని వాళ్లు అయితే ఆ నీళ్లలో మునిగిపోవాల్సిందే. అది లివింగ్ రూమ్. అందులో ఉన్న వస్తువులన్నీ వరద నీటిలో తేలియాడాయి. దీంతో గ్రౌండ్ ఫ్లోర్ కు దిగి తన వస్తువులను పరిశీలించేందుకు ఓ వ్యక్తి అందులో ఈత కొడుతూ కనిపించాడు. తను నీళ్లలో నిలబడి చూడగా నీళ్లలో తను మునిగిపోగా.. పైకి పెట్టిన చేయి సగం వరకు నీళ్లు ఉన్నాయి. తనకు ఈత వచ్చు కాబట్టి ఆ నీళ్లలో ఈత కొట్టాడు. ఒకవేళ ఈత రాకపోతే పరిస్థితి ఏంటి. చిన్నపిల్లలు అందులో పడితే పరిస్థితి ఏంటి. అతడు ఈత కొడుతుండగా పక్కనే ఉన్న మరో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఆ వీడియోను చూసి వామ్మో.. బెంగళూరులో వర్షం అంటే ఏమో అనుకున్నాం కానీ.. ఇంత ఘోరంగా పడిందా అని ముక్కున వేలేసుకుంటున్నారు.
#BengaluruFloods: Water floods Epsilon Villa in #BengaluruRain #Karnataka
ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయరు బత్తాయిలు ???? pic.twitter.com/xbuWXWNGbO— ???????????? ???????????????? ❤️???? (@RajuKCRTrs9999) September 7, 2022