Poojitha Ponnada : దేవిశ్రీ ప్రసాద్ తెలుసు కదా. దేవి సినిమాతో దేవిశ్రీ ప్రసాద్ గా మారి.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా చోటు సంపాదించుకున్నాడు డీఎస్పీ. అంతే కాదు.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా. తన వయసు ప్రస్తుతం 45 కానీ.. ఇప్పటి వరకు దేవీశ్రీ పెళ్లి చేసుకోలేదు. ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని దేవి అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. తను ఇండస్ట్రీలోకి వచ్చిన దశాబ్దాలు అవుతున్నా.. పెద్ద పెద్ద సినిమాలకు మ్యూజిక్ అందించినా ఎప్పుడూ దేవిశ్రీ మీద ఎలాంటి రూమర్స్ రాలేదు.

కానీ.. గత కొన్ని రోజుల నుంచి దేవిశ్రీప్రసాద్.. టాలీవుడ్ నటి పూజిత పొన్నాడతో రిలేషన్ షిప్ లో ఉన్నాడని వార్తలు వచ్చాయి. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇప్పుడు మాత్రం ఏకంగా ఇద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి.
Poojitha Ponnada : తనపై వస్తున్న రూమర్స్ పై ఏనాడూ స్పందించని దేవిశ్రీప్రసాద్
అయితే.. తనపై వస్తున్న రూమర్స్ పై దేవిశ్రీప్రసాద్ మాత్రం ఏనాడూ స్పందించలేదు. కానీ.. పూజిత మాత్రం తాజాగా పుకార్లపై స్పందించింది. ఇటీవల ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవిశ్రీప్రసాద్ తో తనకున్న రిలేషన్ షిపై పూజిత క్లారిటీ ఇచ్చేసింది. దేవిశ్రీప్రసాద్ తో తాను రిలేషన్ లో ఉన్నాను అని వస్తున్న వార్తలు అవాస్తవాలు అని చెప్పింది. అసలు ఇలాంటివి ఎవరు పుట్టిస్తారు.. ఎలా పుట్టిస్తారో నాకు తెలియట్లేదు అంటూ చెప్పుకొచ్చింది పూజిత. అంతే కాదు.. దేవిశ్రీతో రహస్యంగా పెళ్లి కూడా అయిందని అందరూ అంటున్నారు అని చెప్పింది పూజిత. దేవిశ్రీప్రసాద్ తో పరిచయం ఉంది కానీ.. ఆయనతో కలిసి కూర్చొని ఎప్పుడూ మాట్లాడలేదని.. ఆయనతో ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ లో ఎప్పుడూ రిలేషన్ లో లేనని పూజిత చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికి తాను సింగిల్ గానే ఉందని వివరించింది. మరి.. పూజిత వ్యాఖ్యలపై అయినా దేవిశ్రీప్రసాద్ స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే.