Latest News : తమిళ్ సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన రేష్మ పసుపులేటి ప్రస్తుతం హీరోయిన్ గుర్తింపు సాధిస్తూనే మరోపక్క సీరియస్ లో కూడా నటిస్తూ బిజీగా కొనసాగుతుంది. అయితే తమిళ్ సినీ ఇండస్ట్రీలో సెటిల్ అయిన ఈ తెలుగు అమ్మాయి మొదట చాలా కష్టాలను ఎదుర్కొన్నట్లుగా రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక తన సినీ కెరియర్ లో మచ్చగాా మిగిలిపోయిన సూచి లీక్స్ గురించి ఆమె ఈ ఇంటర్వ్యూ లో మాట్లాడింది. అయితే సూచి లిక్స్ అనేది ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ఘటన. దీనిలో స్టార్ హీరో హీరోయిన్స్ మధ్య ఏముందో ,వారి మధ్య ఎలాంటివి జరిగాయో,
వారికి సంబంధించిన ప్రైవేట్ ఫోటోలను వీడియోలను సింగర్ సుచిత్ర సూచి లీక్స్ పేరుతో విడుదల చేసింది. ఇక దీనిలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇరుక్కున్నారు. అయితే ఈ సూచి లీక్స్ లో రేష్మి పసుపులేటి కూడా ఉంది. అయితే ఆమె వీడియో మరి గోరంగా ఉండడం గమనార్హం. ఎవరో ఓ వ్యక్తితో బెడ్ షేర్ చేసుకుంటూ ఫోటోలను దిగుతున్నట్లుగా విడుదలైన వీడియో కొద్ది నిమిషాల్లోనే దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.ఇక ఆ వీడియో రిలీజ్ అవడంతో రేష్మ పరువు పోవడమే కాకుండా తనకున్న కొద్ది అవకాశాలు కూడా చేజారిపోయాయి. ఇక అన్నిటికి మించి ఆ వీడియో చూసిన తన కుటుంబం ఏమనుకున్నారు అని చాలా బాధపడిందట.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడిన రేష్మి ఆ వీడియో విడుదలైన తర్వాత తన చెల్లి ఫోన్ చేసి అక్క నీకు సంబంధించిన వీడియో ఇలా విడుదలైందని చెప్పడంతో షాక్ అయ్యానని చెప్పింది. నా గురించి నా ఫ్యామిలీ అంతా ఏమనుకుంటారని బాధపడ్డానని , దానిని అస్సలు తట్టుకోలేకపోయానని చెప్పుకొచ్చింది. ఇక ఆ వీడియోలో ఉంది నేను కాదని నా ఫేస్ ని మాస్కింగ్ చేశారని ఆ సమయంలో నాకు అసలు బాయ్ ఫ్రెండ్ లేడని సింగిల్ గా ఉన్నానని రేష్మ చెప్పుకొచ్చింది. నా ఫోటోలతో వీడియోలను లీక్ చేసి నన్ను నా కుట్టుంబాన్ని మానసికంగా ఇబ్బంది పెట్టారని రేష్మ తన ఆవేదనను వ్యక్తం చేసింది. దీంతో ప్రస్తుతం రేష్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.