Astrology : నిద్రలో కలలు రావడం చాలా సాధారణం. కేవలం మనుషులకే కాదు పక్షులు, జంతువులు కూడా కలలు కంటాయి. అయితే ఒక్కో కలకు ఒక్కో అర్థం ఉంటుందని శాస్త్రం చెబుతుంది. కొన్ని కలలు మన భవిష్యత్తును సూచిస్తాయట. అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని కలలు అదృష్టాన్ని కలుగజేస్తాయని పండితులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఇవి కలలో కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉన్నట్లు అర్థం. కలలో బంగారం కనిపిస్తే త్వరలో మీరు కోటీశ్వరులు కాబోతున్నారని అర్థం. బంగారం వేసుకున్నట్లు కల వస్తే ఆభరణాలు అపార సంపదలు మీ ఇంట్లోకి వస్తాయని అర్థం.
చాలామంది కలలో పాము కనపిస్తే భయపడిపోతుంటారు. కలలో తెల్లని పామును చూస్తే మీరు సంతోషంగా ఉంటారని అర్థం. జీవితంలో పొందబోయే అద్భుత విజయానికి సంకేతంగా ఈ కలను పేర్కొంటారు. అలాగే కలలో పండ్లతో నిండిన చెట్టు వస్తే మీరు ఆర్థికంగా సెటిల్ కాబోతున్నారని అర్థం. మీరు చెట్టు నుంచి పండ్లు తెంపుకున్నట్లు కల వస్తే అది గొప్ప లాభానికి సంకేతం అని జ్యోతిష పండితులు చెబుతున్నారు. అలాగే కలలో చేపలు కనిపిస్తే చాలా మంచిది అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. కలలో చేపలు పట్టినట్లు కల వస్తే ఆర్థికంగా కలిసి వస్తుందని అర్థం.
అలాగే కలలో డేగలు కనిపిస్తే ధైర్యానికి ప్రతీకగా చెబుతారు. డేగలు కలలో కనిపిస్తే వారి సంకల్పం నెరవేరుతుందని చెబుతున్నారు. బాగా వండిన మాంసాన్ని తినడం గురించి కలలు కనడం కూడా సంపద పెరుగుదల ను సూచిస్తుంది, అయితే పచ్చి మాంసం తినడం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కలలోకి ధాన్యం వస్తే కూడా కలిసి వస్తుందని చెబుతారు. ధాన్యాలు భూమి యొక్క పుష్కలమైన వరాలలో ఒకటిగా పరిగణించబడతాయి. ధాన్యాల గురించి కలలు కనడం అంటే అదృష్టం మీకు సమృద్ధిగా ఎదురుచూస్తుందని అర్థం