Prabhas : ప్రభాస్ పాన్ ఇండియా మూవీ కి తెలుగు కమిడియన్, సలార్ మూవీ లో వినూత్న ప్రయోగం చేయనున్న ప్రశాంత్ నీల్.

Prabhas : ఇప్పుడు మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఇండియా లో ఫిల్మ్ ఇండస్ట్రీ లో నవశకం సృష్టిస్తున్నాడు. ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేశాడు. తను ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ తెలుగు ఇండస్ట్రీలో ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ప్రభాస్ ఎన్నో సినిమాలు చేసి మంచి క్రేజ్ తో ఉన్నాడు. వర్షం సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను అందుకొని ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. తను బాహుబలి సినిమాతో తెలుగోడి సత్తా చాటి ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇలా వరుస చిత్రాలతో హిట్ల మీద హిట్లు తో దూసుకుపోతున్నాడు.

Advertisement

ఇది ఇలా ఉండగా ఇప్పుడు తాజాగా సలార్ అనే సినిమాతో చాలా వేగంగా షూటింగ్ నడుస్తుంది. ఈ సినిమా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కనుంది. ఇది భారీ యాక్షన్ మూవీ గా వస్తున్న చిత్రం.ఇలా ఈ సినిమా గురించి కొన్ని వార్తలు బయటికి వచ్చాయి. ఇండస్ట్రీలోనే మంచి క్రేజ్ ఉన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆయన దర్శకత్వంలో కేజీఎఫ్, కేజిఎఫ్ 2 మూవీస్ నుంచి మంచి సక్సెస్ ని అందుకున్నాడు. దీని తర్వాత రాబోతున్న సినిమా సలార్ ప్రభాస్ హీరోగా రావడం తో అభిమానులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Prabhas : ప్రభాస్ పాన్ ఇండియా మూవీ కి తెలుగు కమిడియన్

Prabas pan india salar movie with telugu comidian
Prabas pan india salar movie with telugu comidian

ఈ చిత్రంలో కొన్ని యాక్షన్ ఎపిసోడ్ తో కొన్ని కామెడీ సీన్స్ కూడా ఉండేటట్లు ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. దీనికోసం టాలీవుడ్ కామెడీ స్టార్ సప్తగిరి తో ఒక రోల్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆయన తాజాగా చేసే సినిమా సలార్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో సప్తగిరి ఒక నెలరోజుల కాల్షీట్స్ ఇస్తున్నారంట అయితే సప్తగిరి కామెడీ ఫుల్ జోష్లో ఉండబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా యూత్ కి నచ్చేటట్లుగా వాళ్లు మెచ్చే విధంగా ఉండబోతున్నట్లు మనకు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ఓ మంచి పాన్ ఇండియా సినిమాతో అభిమానుల ముందుకు రాబోతున్నాడు.

Advertisement