WhatsApp Call : వాట్సప్ కాల్ ను ఎలా రికార్డు చేయాలి? ఆడియో, వీడియో కాల్స్ ను రికార్డ్ చేసుకోవచ్చా?

WhatsApp Call : సాధారణంగా ఎవరితోనైనా ఫోన్ లో మాట్లాడేటప్పుడు కాల్స్ రికార్డు చేస్తుంటాం. అవి సాధారణ కాల్స్. భవిష్యత్తులో వాటితో ఏదైనా ఉపయోగం ఉంటుందని వాటిని రికార్డు చేస్తాం. మరి.. మామూలు కాల్స్ లాగానే.. వాట్సప్ కాల్స్ ను కూడా రికార్డు చేయాలంటే ఎలా? వాట్సప్ కాల్స్ కూడా ఈ మధ్య ఎక్కువ చేస్తున్నారు. బ్యాలెన్స్ లేకున్నా.. నెట్ ఉంటే చాలు.. ఫోన్ లో వాట్సప్ నుంచి ఆడియో, వీడియో కాల్స్ చేసుకోవచ్చు.

Advertisement
how to record whatsapp calls by using cube acr app
how to record whatsapp calls by using cube acr app

కానీ.. వాట్సప్ ఆడియో కాల్స్ ను రికార్డు ఎలా చేసుకోవాలో చాలామందికి తెలియదు. వీడియో కాల్ రికార్డు చేయాలంటే.. స్క్రీన్ రికార్డర్ ను వాడితే సరిపోతుంది. కానీ.. ఆడియో కాల్ కోసం ఒక థర్డ్ పార్టీ యాప్ సాయం తీసుకోవాల్సి ఉంటుంది. దాని పేరే క్యూబ్ ఏసీఆర్. అది ఒక కాల్ రికార్డింగ్ యాప్. ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుంటే వాట్సప్ కాల్స్ అన్నింటినీ రికార్డు చేస్తుంది. ఫోన్ స్టోరేజీలో సేవ్ చేస్తుంది.

Advertisement

WhatsApp Call : ఇది ఎలా పనిచేస్తుందంటే?

దాని కోసం ముందు గూగుల్ ప్లే స్టోర్ నుంచి క్యూబ్ ఏసీఆర్ అనే ఆండ్రాయిడ్ యాప్ ను మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత యాప్ ను ఓపెన్ చేసి ఉంచాలి. అది రన్ అవుతుండగానే.. వాట్సప్ ను ఓపెన్ చేసి వాయిస్ కాల్ చేయాలి. వాయిస్ కాల్ స్టార్ట్ కాగానే.. క్యూబ్ ఏసీఆర్ యాప్ దానంతట అదే రికార్డు చేస్తుంది. ఒకవేళ రికార్డు చేయకపోతే.. యాప్ లో ఫోర్స్ వీఓఐపీ కాల్ యాజ్ వాయిస్ కాల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.

ఐఫోన్ లో కాల్స్ రికార్డు చేయాలంటే చాలా కష్టం. సాధారణ కాల్స్ నే ఐఫోన్ లో రికార్డు చేయలేం. ఇక.. వాట్సప్ కాల్స్ అంటే.. కొన్ని యాప్స్ ఉన్నాయి కానీ.. అవి సరిగ్గా కాల్స్ ను రికార్డు చేయవు. ఆండ్రాయిడ్ ఫోన్ లో మాత్రం ఆ యాప్ ద్వారా వాట్సప్ కాల్ ను రికార్డు చేసుకోవచ్చు.

Advertisement