Pushpa 2 : తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘ మంగళవారం ‘ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేశారు. ఈ ఈవెంట్ లో ‘ పుష్ప 2 ‘ సినిమా గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా నుంచి గంగమ్మ తల్లి జాతర పోస్టర్ ను విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన షూట్ ను రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరిస్తున్నారు అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. ఆ సెట్ నుంచి నేరుగా ఈ ఈవెంట్ కి వచ్చాను అని, చేతులకు ఉన్న పారాణి ఇంకా ఆరనే లేదు చూడండి అని అల్లు అర్జున్ తన చేతులకు ఉన్న పారాణిని చూపించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ మిమ్మల్ని చాలా అలరిస్తుంది అని చెప్పారు.
ఇక ఈ సినిమా వచ్చే సంవత్సరం ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది అని అన్నారు. ఇక ‘ మంగళవారం ‘ సినిమా గురించి చెబుతూ ఈ సినిమాను నిర్మించిన స్వాతి తన వద్దకు వచ్చి ఈ సినిమా గురించి చర్చించారని, తనకు సపోర్ట్ చేస్తానని అల్లు అర్జున్ చెప్పారట. ప్రస్తుతం ఈ ఈవెంట్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక పుష్ప సినిమా వరల్డ్ వైడ్ గా ఎంత క్రేజ్ ను సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలోని బన్నీ నటన, డైలాగ్స్, మ్యానరిజం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. బాలీవుడ్ లో కూడా ఈ సినిమా మంచి సక్సెస్ను అందుకుంది. ఇక రీసెంట్ గానే అల్లు అర్జున్ కి ఈ సినిమా నుంచి ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు వచ్చింది.
ఈ క్రమంలోనే ‘ పుష్ప 2 ‘ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సుకుమార్ అల్లు అర్జున్ కూడా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించి తీయాలని బాగా కష్టపడుతున్నారు. పుష్ప కు నుంచి పుష్ప 2 ఉంటుందని సినిమా టీం చెబుతూనే దానికి హింట్స్ ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. పుష్పరాజ్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు అన్నది కూడా ఈ టీజర్ లో చూపించారు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ ఇచ్చిన అప్డేట్ తో పుష్ప సినిమా మీద భారీ అంచనాలు పెరిగాయి.