Pushpa movie : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘ పుష్ప ‘ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్, రష్మిక మందన దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా పుష్ప సినిమా వచ్చింది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయింది. అందుకు అనుగుణంగానే అన్నిచోట్ల దీనికి భారీ రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా హిందీలో 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇక ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లు రాబట్టడం విశేషం.
Pushpa movie : మరో రికార్డ్ బ్రేక్ చేసిన పుష్ప
ఈ సినిమాలో బన్నీ యాక్టింగ్, మ్యానరిజం, యాసతో పాటు రష్మిక తో కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అంతే కాకుండా ఐటెం సాంగ్ లో హీరోయిన్ సమంత దుమ్ము లేపింది. దీంతో ఎక్కడ చూసినా పుష్ప పాటలు, డైలాగ్స్ కనబడ్డాయి. ఈ సినిమాలోని డైలాగ్స్, డాన్స్ స్టెప్పులు, సాంగ్స్ వీడియోస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి. భారీ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా ఇప్పటికే సైమా అవార్డ్స్ లో ఎక్కువ అవార్డ్స్ ను సొంతం చేసుకుంది. తాజాగా పుష్ప సినిమా మరో అరుదైన గౌరవాన్ని అందుకుంది.
మాస్కోలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పుష్ప సినిమాను ప్రదర్శించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ కింద ఈ ఏడాదికి పుష్ప సినిమా ఎంపికైంది. ఈ సినిమా తెలుగుతోపాటు ఇంగ్లీష్, రష్యన్ సబ్ టైటిల్స్ తో ప్రదర్శించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా పుష్ప సినిమాని రష్యన్ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో పుష్ప సినిమాకి ఉన్న క్రేజ్ మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నట్లు తెలుస్తుంది. మాస్కోలో పుష్ప ప్రదర్శన తర్వాత రష్యన్ ప్రజలతో పాటు ప్రపంచం మొత్తం కూడా తగ్గేదేలే అనే డైలాగ్ చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఈ షో తో అల్లు అర్జున్ క్రేజ్ వరల్డ్ వైడ్ గా మారనున్నట్లు తెలుస్తుంది.