Intinti Gruhalakshmi 21 September Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 21-September-2022 ఎపిసోడ్ 743 ముందుగా మీ కోసం. తులసి ఇంట్లో వాళ్ల అత్తమామలు రహస్యంగా పాయసం తింటూ ఉంటారు, వాళ్లని ఇంట్లోవాళ్లందరూ చూస్తూ సరదాగా ఆటపట్టిస్తూ వుంటారు, తరువాత తులసి శృతితో చెబుతుంది అమ్మ టిఫిన్ రెడీ చేద్దామా హనీకి టిఫిన్ తీసుకెళ్లాలి అని చెబుతుంది. ఒకవైపు సామ్రాట్ హాని గురించి వెతుకుతూ ఉంటాడు ట్యాబ్లెట్ వేసుకునే సమయం అయ్యిందని, బయట ఒక్కతే కూర్చొని ఉంటుంది ఏంటమ్మా ఒక్కదానివే కూర్చున్నావ్ అనగానే, స్కూల్కి వెళ్లేది లేదు, మీరు నాతో ఆదుకోరు, నాకు బోర్ కొడుతుంది అని అనేలోపు, లాస్య లక్కీని తీసుకుని వస్తుంది ఇప్పుడు నీకు బోర్ కొట్టదు అని అంటూ ఆడుకోండి అని చెప్పగానే, హని చాలా సంతోషపడుతుంది, వీళ్లు ఆడుకోవడానికి వెళతారు. లక్కీ ని తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు హనికి చాలా బోర్ కొడుతుంది అని సామ్రాట్ అంటాడు, ఇంతలో అక్కడికి తులసి కూడా వస్తుంది టిఫిన్ తీసుకొని, హాని కోసం టిఫిన్ తీసుకొని వచ్చాను అని అనడంతో, మీకెందుకు శ్రమ అని సామ్రాట్ అంటాడు.
అయినా ఇంట్లో పని వాళ్లు ఉన్నారు కదా అని లాస్య అంటుంది, ఇంటి భోజనం ఇంటి భోజనమే కదా, ఇంతకూ హని ఎక్కడ ఉంది అనగానే, లక్కీతో ఆడుకుంటుంది అని లాస్య అంటోంది, మంచి పని చేశావు లక్కిని తీసుకొనివచ్చి అని, నేను పిల్లలకి తినిపిస్తానని తులసి లోపలికి వెళ్ళి వాళ్ళకి వినిపిస్తూ ఉంటుంది, సామ్రాట్ నందు తొ ఈ రోజు నుంచి కోలుకునే వరకూ లక్కీని మీరు ఇక్కడికి తీసుకుని రండి, ఇక నుంచి ఆఫీస్ కూడా ఇంట్లోనే ఆ ఏర్పాట్లు చేయమని చెబుతాడు. లక్కీ హని ఇద్దరు ఆడుకోడాన్ని చూసి, సామ్రాట్ చాలా సంతోషపడుతూ ఉంటాడు, దిగులుగా కూడా ఆలోచిస్తూ ఉండగా, అక్కడికి తులసి వస్తుంది కాఫీ తీసుకుని, ఏమైంది అని అడుగుతుంది ఆయన్ని, హని ని చూసి సంతోషంగా ఉంది కానీ, సాయంత్రమైతే ఎవరింటికి వాళ్లు వెళ్లిపోతారు, హనికి ఎందుకు అంత శిక్ష వేశాడు తెలియటం లేదు దేవుడు అని, ఇలా హాని గురించి కొద్దిసేపు బాధపడుతూ ఉంటారు, తరువాత నేనందుకే ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను అని తన నిర్ణయాన్ని చెపుతుంది.
Intinti Gruhalakshmi 21 September Today Episode : తులసి ఇంట్లో వాళ్లు ఒప్పుకుంటారా?
హనీని నయమయ్యేవరకు మా ఇంటికి పంపించండి ఇంట్లోవాళ్లందరూ చూసుకుంటాం అని అనగానే, హనీ నన్ను వదిలి వెళుతుందో లేదో తెలియదు కానీ, నేను వదిలి ఉండలేను, మీరే ఒక పని చేయండి అందరూ మా ఇంటికి వచ్చి కొన్ని రోజులు ఉండండి అని అనగానే, తులసి ఇంట్లో వాళ్లతో అడిగాక చెబుతాను అని అంటుంది. తరువాత నందు లాస్య ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు, తులసి ఎప్పుడూ అక్కడే ఉంటుంది, తులసి చేసే పనులు చూస్తే విసుగు వస్తుంది అనగానే, మనం అనుకున్న ఒక పనైతే అయ్యింది లక్కీని హనీకి దగ్గర చేసాం కదా, ఈ వంకతో మనమూ సామ్రాట్ దగ్గర మంచి మార్కులు తెచ్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు, ఒకవైపు తులసి ఇంట్లో వాళ్ళు అభికి నచ్చజెపుతూ ఉంటారు సామ్రాట్ ఇంటికి వెళ్లే విషయంలో, తులసి అంటోంది ఒకవేళ నీకక్కడ నచ్చకపోతే మళ్లీ మన ఇంటికి తిరిగి వద్దాం అని అంటుంది, ఇంకొకవైపు లాస్య వాళ్లు కూడా అనుకుంటూ ఉంటారు, లాస్య నందు తొ ఇలా అంటుంది, మనం రేపటి నుంచి సామ్రాట్ ఇంటికి వెళ్లి అక్కడే వుందాం అని అంటుంది. తరువాత సామ్రాట్, వాళ్ల బాబాయ్ తో ఇలా చెబుతూ ఉంటాడు, తులసీ వాళ్లు ఇక్కడికి వస్తున్నారు అని, ఇలా ఇద్దరూ సంతోషంగా మాట్లాడుతూ ఉండగా, ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.