పోలీసు నియామకం పరీక్షలో ‘బలగం’ సినిమా మీద ప్రశ్న?

ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో, ఇంటర్ వ్యూ లో, పాట్య పుస్తాకాలల్లో జనరల్ క్యాటగిరిలో ఏ సబ్జేట్ మీదనైనా ప్రశ్న వేయవచ్చు. కానీ సినిమాల మీద ఎలాంటి ప్రశ్నలు వేయరు. ‘సినిమాల మీద ప్రశ్నలు వేయరాదు’ అనేది ప్రభుత్వ ఉత్తర్వు కాదు. కానీ దీనిని ఓ దిక్కుమాలిన ఆచారంగా అనాదిగా అన్ని ప్రభుత్వాలు పాటిస్తూ వస్తున్నాయి.

Advertisement

అసలు సినిమా అనేది విజ్ఞానం కాదు అని ఐఏఎస్ లు భావిస్తారు. రాజకీయ నాయకులు, చదువుకున్న మేధావులు కూడా ఇలాగే భావిస్తారు. సినిమాలు, నాటకాలు, టి వి లు కేవలం వినోదం కిందికి వస్తాయి అని భావిస్తారు. కానీ ఇది పచ్చి అబద్దం. దశావతారం తరువాత దేవుడు ఎత్తిన మరో అవతారమే సినిమా. అంత గొప్ప పవర్ ఫుల్ మీడియా. ఆ మాటకొస్తే రాజకీయం కంటే పవర్ఫుల్ మీడియా.

Advertisement

అందుకే పాత పద్దతికి స్వస్తి చెపుతూ, సినిమా అనేది ప్రజలల్లో చాలా బలమైన మీడియా అని భావించిన తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారి కొత్త ప్రయోగాన్ని చేపట్టింది. ఆదివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి (టి ఎస్ ఎల్ పి ఆర్ బి) ఆధ్వర్యంలో ఎస్ ఐ, కానిస్టేబుల్ల తుది పరీక్షలు నిన్నటితో ముగిసాయి.

అయితే కానిస్టేబుల్ల పరీక్షలో ఎవ్వరు ఊహించని విధంగా, సంచలన విజయం సాధించిన ‘బలగం’ సినిమా గురించి ఓ ప్రశ్న అడిగారు. మార్చ్ 2023 లో ప్రతిస్టాత్మక ‘ఒనికో ఫిలిమ్స్’ అవార్డు లల్లో ‘బలగం’ సినిమాకు ఏ విభాగంలో పురస్కారం లభించింది? అన్నది ప్రశ్న. దీనికి ఆప్షలు గా ఏ. ఉత్తమ దర్శకుడు, బి. ఉత్తమ డాక్యుమెంటరీ, సి. ఉత్తమ నాటకం, డి. ఉత్తమ సంభాషణలు అని ఇచ్చారు.

ఇప్పటివరకు ‘షోలే’, ‘మొగిలే ఆజం’, ‘పాకీజా’, ఎన్ టి ‘లవకుశ’, ఏ ఎన్ ఆర్ ‘దేవదాసు’, రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్ లాంటి ఏ సినిమాలకు దక్కని ఖ్యాతి ఈ బలగం సినిమా నిర్మాత దిల్ రాజుకు దక్కింది. శభాష్ దిల్ రాజు.

Advertisement