Rajamouli : ఇండస్ట్రీని షేక్ చేస్తున్న అగ్ర దర్శకుడు రాజమౌళి ఈయన త్రిబుల్ ఆర్ మూవీ చేసి ఏ లెవెల్ లో దూసుకెళ్తున్నాడో అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ తనయుడైన మహేష్ బాబుతో మూవీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మహేష్ బాబు, క్రేజీ డైరెక్టర్ రాజమౌళి అద్భుతమైన కాంబినేషన్ మూవీ కోసం ప్రేక్షకులంతా ఎంతో ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు 28వ మూవీ గురించి అభిమానులు ఒక రేంజ్ లో వెయిటింగ్ చేస్తున్నారు. మహేష్ బాబు మూవీ అంటే అభిమానులకి అంత పిచ్చి ఉంటుంది.
Rajamouli : రాజమౌళి మహేష్ కాంబో మూవీకి హీరోయిన్ ఎవరో తెలుసా…
ఇక దాంతోపాటు ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్ డైరెక్టర్ తో మహేష్ మూవీ అంటే ప్రేక్షకులు సందడే సందడి. ఈ మూవీ ప్రకటన చేసిన దగ్గర నుండి మహేష్ తో రాజమౌళి ఎటువంటి మూవీ అభిమానుల ముందుకు తీసుకొస్తాడో అనే ఎగ్జైటింగ్ అభిమానులలో కలుగుతుంది.ఇక ఇది ఇలా ఉంటే రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా అభిమానులు ముందుకి తీసుకొస్తున్న ఈ మూవీపై ఫ్యాన్స్ ఒక రేంజ్ లో అంచనాలను వేసుకుంటున్నారు. త్రిబుల్ ఆర్ మూవీ ఇంకొక్కసారి తెలుగు మూవీ ప్రపంచవ్యాప్తంగా సాటిన స్టార్ డైరెక్టర్ రాజమౌళి. మహేష్ బాబుతో మరో వండర్ కి సిద్ధమవుతున్నారు.
మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రం దర్శకత్వంలో మూవీలో చేస్తున్న సంగతి తెలిసినదే. ఈ మూవీ కంప్లీట్ అవ్వగానే రాజమౌళి మూవీ మొదలు పెడతామని తెలియజేస్తున్నారు. ఇది పక్కన ఉంచితే ప్రస్తుతం ఈ మూవీ పై ఒక కామెంట్ అయితే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీలో హీరోయిన్ గా హిందీ అందాల ముద్దుగుమ్మ దీపికా పదుకొనె ఒక రేంజ్ లో దూసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో మామూలుగా హల్చల్ అవడం లేదు. ఇప్పుడు మాత్రం దీనిలో ఎటువంటి క్లారిటీ రాలేదు. ఈ టాక్లో ఎంతవరకు వాస్తవం ఉందో.. తేలియాలంటే అధికార ప్రకటన బయటికి వచ్చేవరకు అభిమానులు వేచి ఉండాల్సిందే..