PM Kisan Mandhan Yojana : జాబ్ కి సెలవిచ్చిన, సంస్థలులు మూతపడ్డ, ప్రభుత్వాలు పని చేయకున్నా దేశాన్ని విరామం లేకుండా ముందుకు నడిపించే రైతన్న దేశానికే బ్యాక్ బొన్. అలాంటి రైతన్న ప్రస్తుత పరిస్థితుల్లో పంట పండించడానికి పడుతున్న కష్టాలను గుర్తించిన సెంట్రల్ గవ్నమెంట్ వారిని ఆదుకోవాలనే ఆలోచనతో పిఎం కిసాన్ మన్ ధన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. 60 ఏళ్ల వయస్సు దాటిన సన్న, చిన్నకారు రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ మన్ ధన్ యోజన అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ప్రతి నెల రైతులకు 3,000 పెన్షన్ ఇస్తుంది. అంటే మొత్తం సంవత్సరానికి 36 వేలను అందిస్తుంది.
PM Kisan Mandhan Yojana : ఈ పథకంలో చేరడానికి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు గల వారు అర్హులు.
2019 ఆగస్టు నాటికి దేశంలో అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల లాండ్ రిజిష్టర్స్ లో పేర్లు ఉండి. 2 హెక్టార్ల వరకు సాగు చేయదగిన భూమిని కలిగి ఉండాలి. అలాంటి సన్నకారు రైతులందరూ ఈ పథకం కింద పెన్షన్ పొందడానికి పేర్లు నమోదు చేసుకోవచ్చు. పెన్షన్ పొందడానికి 60 ఏళ్లు నిండాలి. 18 సంవత్సరాల వయసు నుంచి చేరిన రైతులు ఈ పథకంలో కోసం నెలకు రూ. 55 కట్టాలి. 30 ఏళ్లు కలిగిన వారు స్కీమ్‌లో చేరితే నెలకు 110 రూపాయలు చెల్లించాలి. అదే 40 ఏళ్ల వయసులో స్కీమ్‌లో చేరితే నెలకు 200 రూపాయలు డిపాజిట్.
ఇక 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి నెలా రైతులకు 3,000 పెన్షన్ లభిస్తుంది. పెన్షన్ పొందే రైతు చనిపోతే అతడి జీవిత భాగస్వామికి 50% పెన్షన్ వస్తుంది. కుటుంబ పెన్షన్‌కు జీవిత భాగస్వామి మాత్రమే అర్హులు.భూమికి సంబంధించిన పేపర్స్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్, వార్షిక ఆదాయ సర్టిఫికేట్‌లను తీసుకుని సాధారణ సేవా కేంద్రాన్ని సందర్శించాలి. అన్ని వివరాలను రిజిష్టర్ చేశాకా, ఆధార్‌తో లింక్ చేసుకునే ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఆ తర్వాత ఈ ప్రాసెస్ పూర్తయి, కిసాన్ పెన్షన్ ఖాతా సంఖ్య, పెన్షన్ కార్డు వస్తుంది.