Ramarao on Duty : మహారాజా రవితేజ నటిస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. ఈ సినిమా జులై 29న రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ సినిమా డైరెక్టర్ శరత్ మండవ డైరెక్షన్లో వస్తున్న మూవీ ట్రైలర్ లాంచ్ కు సంబంధించి ఈవెంట్ ఈనెల జూలై 16న జరగబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఈవెంట్ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ఏకంగా ఆరుగురు డైరెక్టర్స్ తో సందడి చేయనున్నారన్నట్లు ప్రకటించారు. ఇప్పుడు క్రేజ్ లో ఉన్న డైరెక్టర్ అయినటువంటి గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, త్రినాధరావు నక్కిన, సుధీర్ వర్మ, బాబి, వంశీకృష్ణ నాయుడు అతిధులుగా రాబోతున్నారు. ఈ మూవీలో వేణు తొట్టెంపూడి చాలా గ్యాప్ తర్వాత ఇంట్రెస్టింగ్ రోల్ లో ఈ సినిమాలో కనిపించనున్నాడు.
Ramarao on Duty : రామారావు ఆన్ డ్యూటీ ఈవెంట్ కు మాస్ మహారాజా అదిరిపోయే ప్లాన్…
ఇప్పటికే మూవీ మేకింగ్ లో యాక్షన్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేయగా ఈ వీడియో నెట్ లో ట్రెండ్ అవుతూ చెక్కర్లు కొడుతుంది. రామారావు ఆన్ డ్యూటీ మూవీలో తనికెళ్ల భరణి, నాజర్, పవిత్ర లోకేష్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి శ్యామ్ సి ఎస్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించగా ఆర్ టీ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Mass Directors to grace our Mass Maharaja’s #RamaRaoOnDuty Trailer Launch Event Tomorrow ????
– https://t.co/Ec9WC1f9m5#RamaRaoOnDutyOnJuly29@RaviTeja_offl @directorsarat @Divyanshaaaaaa @rajisha_vijayan @SamCSmusic @sathyaDP @sahisuresh @Cinemainmygenes @RTTeamWorks pic.twitter.com/WDIKpPJhrb
— SLV Cinemas (@SLVCinemasOffl) July 15, 2022