Macherla Niyojakavargam : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాచెర్ల నియోజకవర్గం. ఈ సినిమా మీద తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. రంగ్ దే తర్వాత నితిన్ చేస్తున్న సినిమా ఇది. ఏం రాజశేఖర్ రెడ్డి డైరెక్టర్. ఈ సినిమాలో నితిన్ కలెక్టర్ గా కనిపించనున్నాడు. ఆగస్టు 12 న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
సినిమాకు సంబంధించిన ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తున్నాయి. మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే.. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ను కూడా పెట్టారు. నితిన్ తొలి మూవీ జయం సినిమాలోని సూపర్ డూపర్ హిట్ అయిన రాను రాను అంటూనే చిన్నదో అనే పాటను రీమిక్స్ చేసి ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ గా పెట్టారు.
Macherla Niyojakavargam : ఆ హీరోయిన్ నో అంటే అంజలిని తీసుకున్నారు
ఆ పాటలో నితిన్ తో కలిసి హీరోయిన్ అంజలి స్టెప్పులేసిన విషయం తెలిసిందే. అయితే.. ఆ పాటలో ముందు హీరోయిన్ సదాను తీసుకుందామనుకున్నారట. జయం సినిమాలో హీరోయిన్ సదా కావడం.. ఆ పాటలో నితిన్ తో కలిసి స్టెప్పులేసింది కూడా సదానే కావడంతో రీమిక్స్ సాంగ్ కు కూడా సదా అయితే బాగుంటుందని మూవీ మేకర్స్ భావించారట. కానీ.. సదా మాత్రం తాను రీమిక్స్ సాంగ్ చేయనని సింపుల్ గా నో చెప్పేసిందట.
అప్పుడు నితిన్ పక్కన హీరోయిన్ గా చేసి.. ఇప్పుడు ఆయన పక్కన స్పెషల్ సాంగ్ కు మాత్రమే చేయడం తనకు ఇష్టం లేదని.. సింపుల్ గా చెప్పేసిందట. దీంతో అంజలిని సంప్రదించి తనను ఐటెమ్ సాంగ్ కు తీసుకున్నారట. అలా అంజలితో స్పెషల్ సాంగ్ ను కానిచ్చేశారు.