ఆర్జీవి కొత్త ఆఫీస్ చూస్తారా .. మొత్తం బట్టలు లేకుండా ఉన్న అమ్మాయిల బొమ్మలే ..!!

Ramgopal Varma-RGV DEN

టాలీవుడ్ లో ఎంతమంది డైరెక్టర్ లు ఉన్న రామ్ గోపాల్ వర్మ Ramgopal Varma కి ఉండే క్రేజ్ వేరు. ఆయన ప్రతి సినిమాలో తన మార్క్ ను చూపిస్తారు. ప్రతి సినిమాలో తనదైన ముద్ర, తనదైన ఆలోచనలు ఉండేలా చూసుకుంటారు. అయితే తాజాగా రాంగోపాల్ వర్మ తన కొత్త ఆఫీసును తెరిచారు. ఆఫీసును ప్రత్యేకంగా అభిమానులకు చూపించాలని అనుకున్నారు. ఆయన ఏర్పాటు చేసుకున్న సినిమా ఆఫీస్ కేవలం సినిమాల కోసం మాత్రమే. అయినా చాలా ఖర్చు పెట్టి మరీ డిజైన్ చేశారు. తన ఆఫీసు ఎలా ఉందో మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Advertisement

ఆయన తన గతం గుర్తు చేసుకుంటూ ఆ వీడియో కొనసాగుతుంది. ఆఫీస్ ముందు భాగాన్ని సైకిల్ చైన్, మధ్యలో గన్ ఉండేలా ఏర్పాటు చేశారు. అలాగే లోపల అమ్మాయిల నగ్నఫోటోలను ఎక్కువగా పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆర్జీవీనా మజాకా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నీకు ఇంత పిచ్చి ఏంట్రా అంటున్నారు.

Advertisement

ఇకపోతే ఆర్జీవి RGV ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై ఒక సినిమా తీయబోతున్నానని ఇదివరకే ప్రకటించారు. ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. అందులో మొదటి భాగానికి వ్యూహం అని, రెండో భాగానికి శపథం అని టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టాడు. అందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఈ సినిమాలో ఏపీ సీఎం జగన్, వైయస్ భారతి పాత్రలలో ఎవరు నటిస్తున్నారో చెప్పాడు. జగన్ పాత్రలో అజ్మల్ అమీర్, వైయస్ భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటిస్తున్నారు.

Advertisement